అప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉంది: రామానుజచార్యుల విగ్రహంపై రాహుల్‌కి కిషన్ రెడ్డి కౌంటర్

Published : Feb 10, 2022, 02:52 PM ISTUpdated : Feb 10, 2022, 03:05 PM IST
అప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉంది: రామానుజచార్యుల విగ్రహంపై రాహుల్‌కి కిషన్ రెడ్డి కౌంటర్

సారాంశం

రామానుజచార్యుల విగ్రహం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ కు  కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు.

హైదరాబాద్: Hyderabadసమీపంలోని ముచ్చింతల్ లో Ramanujacharyaవిగ్రహం విషయంలో Congress పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి Kishan Reddy స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సమతా విగ్రహం తయారీకి, BJPప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 8 ఏళ్ల క్రితమే రామానుజాచార్యుల విగ్రహం తయారీ ప్రారంభమైందన్నారు. ఆ సమయంలో కేంద్రంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. 

విగ్రహం తయారీకి అవసరమైన నిధులన్నీ ప్రైవేటుగా సమకూర్చినవే అని స్పష్టం చేశారు. ప్రధాని Narendra Modi పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వకముందే విగ్రహం తయారీ ప్రారంభమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకున్న పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.

 

రామానుజచార్యుల విగ్రహం చైనాలో తయారైందని ఆత్మ నిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడడమా అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి అదే స్థాయిలో కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు.ఈ నెల 5వ తేదీన ముచ్చింతల్ లో రామానుజచార్యుల విగ్రహన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామానుజచార్యుల వెయ్యేళ్ల ఉత్సవాలను పురస్కరించుకొని ఈ విగ్రహన్ని ఏర్పాటు చేశారు.  ఈ నెల 14వ తేదీ వరకు పలు కార్యక్రమాలను ముచ్చింతల్ లోని సమతామూర్తి కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితర ప్రముఖులు సమతామూర్తి కేంద్రాన్ని దర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?