Hijab Row: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Published : Feb 10, 2022, 12:40 PM ISTUpdated : Feb 10, 2022, 12:56 PM IST
Hijab Row: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

సారాంశం

హిజాబ్ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. సింధూరం ధరించడం స్త్రీల వ్యక్తిగత స్వేఛ్చ అయితే హిజాబ్ కూడా వ్యక్తిగత స్వేచ్ఛే అని ఆమె అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: Hijab అంశానికి సంబంధించి TRS ఎమ్మెల్సీ kalvakuntla kavitha గురువారం నాడు స్పందించారు. Twitter వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు  స్వంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉందన్నారు.. స్త్రీలు సృష్టికర్తలు అని ఆమె చెప్పారు. 

 

నుదుటిపై సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛే అవుతుందని ఆమె చెప్పారు. ఎలా ఉండాలి? ధరించాలి ? అనే అంశాలు మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని ఆమె కోరారు.  అంతేకాదు హిందీలో రాసిన కవితను కూడా ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు.

.గ‌త‌నెల‌లోUdupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి Hijabలు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌నీ తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో  తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో  నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో  ఫిబ్రవరి 8  ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ High Courtలో  పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించనుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హిజాబ్ వివాదం  కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. హైద్రాబాద్ లో కూడా కొందరు విద్యార్ధులు హిజాబ్ కు మద్దతుగా బుధవారం నాడు ర్యాలీలు చేశారు. 

హిజాబ్ అంశానికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి విస్తృత ధర్మాసనం బుధవారం నాడు రిఫర్ చేసింది. ఈ పిటిషన్ పై విస్తృత ధర్మాసనం విచారణ చేయనుంది.  అయితే ఈ విషయమై ఇవాళ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక హైకోర్టు విస్తృత ధర్మాసనంలో ఈ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది.ఈ విషయమై కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టులో ఈరోజు విచారణకు వస్తుందని.. ఈ దశలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకోనివ్వండి అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?