సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Published : Oct 05, 2017, 02:48 PM ISTUpdated : Mar 24, 2018, 12:04 PM IST
సంపులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

సారాంశం

పంక్షన్ హాల్ సంపులో పడి చిన్నారుల మృతి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబీకులు అనుమానాస్పద మఈతిగా కేసు నమోదు

ఎల్ బి నగర్ పరిధి లోని నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ పెళ్లికి హాజరైన కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు పంక్షన్ హాల్ బయట ఉన్న నీటి సంపులో పడి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే నందిగామ కు ఓ కుటుంబం బందువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో హైదరాబాద్ కు వచ్చారు. వారంతా ఇవాళ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్  పెళ్లికి హాజరయ్యారు.  ఈ కుటుంబానికి చెందిన గంటా జితేందర్, గంటా మనశ్రీ అనే ఇద్దరు చిన్నారులు పంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్నారు. అయితే ప్రమాద శాత్తూ పిల్లలు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి పోయారు. ఇది  గమనించిన కుటుంబసభ్యులు పిల్లలను బయటకు తీసి హాస్పిటల్ కి తీసుకేళ్ళే లోపు ఇద్దరూ చనిపోయారు.ఇద్దరు చిన్నారులు ఓకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావటంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  సంపులో కరెంట్ షాక్ కొట్టడంతోనే పిల్లలు మృతి చెందారని కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు.  బాలల హక్కుల సంఘం కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు చనిపోయారంటూ సిపికి పిర్యాదు చేసింది.

అయితే పంక్షన్ హాల్ లోని సీసీ కెమెరా దృశ్యాలను యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఈ సంఘటనను అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu