తెలంగాణ టిడిపి నేతల గురించి ఎర్రబెల్లి ఏమన్నారంటే ?

Published : Oct 05, 2017, 01:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణ టిడిపి నేతల గురించి ఎర్రబెల్లి ఏమన్నారంటే ?

సారాంశం

టిడిపి నేతల గురించి వివరించిన ఎర్రబెల్లి రేవంత్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన ఎర్రబెల్లి కేసిఆర్ మీద కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

తెలంగాణ టిడిపిలో రేవంత్ మినహా మిగతా వారంతా టిఆర్ఎస్ తో కలిసిపోదామన్న ఉద్దేశంతో ఉన్నారు.. అందులో మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ లాంటి సీనియర్లంతా టీఆర్ఎస్ తో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారు-అనేది ఆయన ఆఫ్ ది రికార్డు కామెంట్

తెలంగాణలో టిడిపి నేతల గురించి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సచివాలయానికి వచ్చిన ఎర్రబెల్లి  దయాకర్ రావు మీడియాతో పలు అంశాల మీద మాట్లాడారు.

తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో యమా క్రేజ్ ఉందని ఎర్రబెల్లి చెప్పారు. ఆయన ఫొటోలు పెట్టుకుని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అనంతపురంలో కేసిఆర్ కు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. తానే ఆశ్చర్యపోయానని వెల్లడించారు.

తెలంగాణ టిడిపిలో రేవంత్ మినహా మిగతా వారంతా టిఆర్ఎస్ తో కలిసిపోదామన్న ఉద్దేశంతో ఉన్నారు.. అందులో మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ లాంటి సీనియర్లంతా టీఆర్ఎస్ తో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారు-అనేది ఆయన ఆఫ్ ది రికార్డు కామెంట్

రేవంత్ మాత్రం వేరే ఉద్దేశంతో ఉన్నట్లు తనకు అర్థమైందన్నారు. ఆయనొక్కడే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాడని ఎర్రబెల్లి వెల్లడించారు. అయితే టిడిపిలో జరుగుతున్న పరిణామాలను ఎర్రబెల్లి బాగానే గుట్టు పట్టేశారే అని మీడియా ప్రతినిధులు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి

https://goo.gl/dDD13Xhttps://goo.gl/dDD13X

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!