హైదరాబాద్‌లో ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏం జరిగిందంటే..?

Published : Jul 25, 2023, 10:49 AM IST
హైదరాబాద్‌లో ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏం జరిగిందంటే..?

సారాంశం

దేశవ్యాప్తంగా రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ దుర్ఘటన తర్వాత ఏ  చిన్న ప్రమాదం చోటుచేసుకున్న జనాలు ఉలిక్కిపడుతున్నారు.

దేశవ్యాప్తంగా రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్ దుర్ఘటన తర్వాత ఏ  చిన్న ప్రమాదం చోటుచేసుకున్న జనాలు ఉలిక్కిపడుతున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య.. బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు మరింత కలవరానికి గురయ్యారు. 

తాజాగా హైదరాబాద్ మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లు  కూడా ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి. అయితే అప్రమత్తమైన లోకో పైలట్లు రెండు రైళ్లను ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు రెండు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు. ఆ తర్వాత  రూట్ క్లియర్ చేసి ఓ రైలును మరో ట్రాక్ పైకి మళ్లించారు. అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!