హైదరాబాద్ : మరదలిపై కన్నేసిన ఉన్మాది... నిరాకరించిందని గొంతుకోసి హత్యాయత్నం

Published : Jul 25, 2023, 10:15 AM IST
హైదరాబాద్ : మరదలిపై కన్నేసిన ఉన్మాది... నిరాకరించిందని గొంతుకోసి హత్యాయత్నం

సారాంశం

తన ప్రేమను నిరాాకరించిందని మరదలు వరసయ్యే యువతి గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడో ఉన్మాది. ఈ దారుణం హైదరాబాద్ ఉప్పల్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. 

హైదరాబాద్: ప్రేమ పేరుతో వెంటపడుతూ అమ్మాయిలను వేధించే సైకోలు దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయి ప్రేమను అంగీకరిస్తే సరే... ఒకవేళ ఇష్టంలేదని చెప్పి నిరాకరించారో ఇక అంతే సంగతి. వాడిలోని ఉన్మాది బయటకు వచ్చి దారుణంగా చంపడానికి వెనుకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమకు అంగీకరించడం లేదని మరదలు వరసయ్యే బంధువుల అమ్మాయి గొంతుకోసి చంపడానికి ప్రయత్నించాడు.  

పోలీసులు, బాధిత యువతి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడలో లక్ష్మీనారాయణ(31) కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. అతడికి ఇప్పటికే పెళ్లయి భార్య, కొడుకు వున్నారు. అయినప్పటికి రామంతాపూర్ లో వుంటున్న మరదలు వరసయ్యే బంధువుల అమ్మాయిపై అతడి కన్ను పడింది. యువతితో పరిచయం పెంచుకుని చనువుగా వుండటం చేసాడు. బాగా తెలిసివాడు కావడంతో యువతి కూడా లక్ష్మీనారాయణతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంది. 

కొంతకాలం యువతితో బాగానే వున్న లక్ష్మినారాయణ తన ప్రేమను బయటపెట్టాడు. ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడ్డా ఇప్పటికే పెళ్లయి భార్యాపిల్లలున్న అతడిని యువతి నిరాకరించింది. ఇలాగే మంచి స్నేహితులుగా వుందామని... ప్రేమ, పెళ్లి అంటూ వేధించవద్దని యువతి సూచించింది. కానీ తన ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష పెంచుకున్న లక్ష్మీనారాయణ ఉన్మాదిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. 

Read More  ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో ఆత్మహత్య...

ఈ నెల 22న యువతికి ఫోన్ చేసిన లక్ష్మీనారాయణ మాట్లాడేది వుందంటూ బయటకు రమ్మన్నాడు. ఆమెను కారులో ఎక్కించుకుని ఉప్పల్ భగాయత్ లోని హెచ్ఎండిఎ లేఔట్ వద్దకు తీసుకెళ్లాడు. కారులోనే కూర్చుని తనను ప్రేమించాలని మరోసారి కోరాడు. అందుకు ఆమె మళ్లీ నో చెప్పడంతో ఆవేశంగా ఊగిపోతూ వెంటతెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోసి చంపడానికి ప్రయత్నించగా ఎలాగోలా అతడినుండి తప్పించుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే యువతి సోదరుడు అక్కడికి చేరుకుని హాస్పిటల్ కు తరలించాడు. సమయానికి చికిత్స అందడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. 

యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు లక్ష్మీనారాయణపై హత్యాయత్నంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేసి నిన్న(సోమవారం) కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్