హైద్రాబాద్‌లో విషాదం: టిఫిన్ కోసం నిలబడ్డ వారిని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

By narsimha lode  |  First Published Jan 1, 2023, 9:21 AM IST


హైద్రాబాద్ నగరంలోని  బంజారాహిల్స్ లో  ఆదివారం నాడు  టిఫిన్ కోసం  నిలబడి ఉన్న వారిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందిరు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


హైదరాబాద్: నగరంలోని  బంజారాహిల్స్ లో   ఆదివారం నాడు     కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.   కారును అతివేగంగా  నడపడం వల్ల  ఈ ప్రమాదం జరిగిందని  ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మద్యం మత్తులో  కారును నడిపినట్టుగా  స్థానికులుఆరోపిస్తున్నారు.   బంజారాహిల్స్ లో ఓ టిఫిన్ సెంటర్ వద్ద  టిఫిన్ కోసం   నిలబడి ఉన్నవారిపై  కారు దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో  ఇద్దరు  అక్కడికక్కడే మృతి చెందారు. మరో  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో   రావులపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ , బీమవరానికి చెందిన  ఈశ్వరిలు మృతి చెందారు. ఈశ్వరీ  ఇళ్లలో పనిచేసుకొని జీవనం సాగిస్తుంది.  శ్రీనివాస్  పెయింటర్ గా  పనిచేస్తున్నాడు.  టిఫిన్ సెంటర్ వద్ద నిలిపి ఉన్న మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.  కారులో ఉన్న ప్రణవ్, వర్ధన్ అనే ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కారును మద్యం మత్తులో నడిపినట్టుగా  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయమై పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.   

దేశ వ్యాప్తంగా  ప్రతి రోజూ ప్రతి పలు  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.      వేగంగా  వాహనాలు  నడపడంతో  ప్రమాదాలు జరుగుతున్నాయి.  అంతే కాదు  డ్రైవింగ్ సమయంలో  నిర్లక్ష్యం,  మద్యం మత్తులో  ర్యాష్ డ్రైవింగ్  చేయడం వంటి పరిణామాలు కూడా  ప్రమాదాలకు  కారణంగా  పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నా  పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు  కూడా లేకపోలేదు.

Latest Videos

undefined

హైద్రాబాద్ గచ్చిబౌలిలో గత ఏడాది డిసెంబర్  26వ తేదీన  జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలంలోని హసనాపూర్  వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.  రెండు బైక్ లు ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన  గత ఏడాది 26న జరిగింది.గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతలో  గత ఏడాది డిసెంబర్  25న జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.హైవేపై  కారు, ట్రక్కు ఢీకొన్నాయి. 

also read:మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు: మృతదేహలకు పోస్టు మార్టం పూర్తి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు మృతి చెందిన ఘటన గత ఏడాది డిసెంబర్  24న జరిగింది.,  తమిళనాడులోని తేని జిల్లాలో  ఈ ప్రమాదం చోటు  చేసుకుంది. శబరిమల నుండి తిరిగి  వస్తున్న సమయంలో  అయ్యప్ప స్వాములు ప్రయాణీస్తున్న బస్సు కుముళికొండ వద్ద  అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో  ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  ఉత్తర సిక్కింలో  ఆర్మీ జవాన్లు ప్రయాణీస్తున్న బస్సు  లోయలో పడిపోవడంతో  16 మంది ఆర్మీ జవాన్లు  అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన గత ఏడాది డిసెంబర్  23న జరిగింది. ఈ ఘటనలో  గాయపడిన  ఆర్మీ జవాన్లను  సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

click me!