బైక్ మీద మెరుపు వేగానికి ఈ ఇద్దరు బలి

Published : Mar 03, 2018, 05:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
బైక్ మీద మెరుపు వేగానికి ఈ ఇద్దరు బలి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీిరింగ్ స్టూడెంట్స్ మృతి రామోజి ఫిల్మ్ సిటీ పరిసరాల్లో ప్రమాదం

బైక్ మీద మెరుపు వేగంతో వెళ్లడంతో ఈ ఇద్దరు యువతీ యువకులు బలయ్యారు. సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వైష్ణవి, లోకేష్ లు వేగంగా బైక్ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కళాశాలలో సెలబ్రేషన్స్ ఉన్న కారణంగా తొందరగా కాలేజీకి వెళ్లే ప్రయత్నంలో వీరు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. చనిపోయిన అమ్మాయి వైష్ణవి డ్యాన్స్ షో ఈరోజు కాలేజీ వేడుకల్లో భాగంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Kaannepalli Saralamma Jatharaలో సీతక్క, పోలీసుల డాన్స్ వైరల్ | Viral Dance | Asianet News Telugu
KTR Slams Revanth Reddy: తెలివి, ఓపిక లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు | Asianet News Telugu