Coronavirus: కరోనా తన ప్రభావం పెంచుకుంటూ ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కొందరు కేటుగాళ్లు.. కరోనా వైరస్ నకిలీ పరీక్షలు, ఫేక్ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల దందాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కరోనా నకిలీ పరీక్షల సర్టిఫికేట్ల వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తెలంగాణలోనూ కొందరు కేటుగాళ్లు కరోనా నకిలీ (Coronavirus) పరీక్షలు, టీకా సర్టిఫికేట్ల నకిలీ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లో నకిలీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల దందాకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Coronavirus: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్ లోనూ కరోనా వైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. దీంతో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ (Coronavirus) బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. అయితే, కరోనా తన ప్రభావం పెంచుకుంటూ ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కొందరు కేటుగాళ్లు.. కరోనా వైరస్ నకిలీ పరీక్షలు, ఫేక్ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల దందాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాధిలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నకిలీ పరిక్షల సర్టిఫికేట్ల వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తెలంగాణలోనూ కొందరు కేటుగాళ్లు కరోనా (Coronavirus) పరీక్షలు, టీకా సర్టిఫికేట్ల నకిలీ దందాకు తెరలేపారు. హైదరాబాద్‌లో నకిలీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వ్యక్తులు కరోనా వైరస్ (Coronavirus) నకిలీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులు(RT-PCR test reports), కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లను విక్రయించి డబ్బులు వసూలు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి గుమ్మి తెలిపారు. ఈ నకిలీ దందాకు పాల్పడిన ఇద్దరు నిందితులపై మలక్‌పేట, హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా నకిలీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులు, కోవిడ్-19 నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విక్రయానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన లక్ష్మణ్.. ల్యాబ్ టెక్నీషియన్‌గా వివిధ డయాగ్నస్టిక్ సెంటర్లలో పనిచేశాడు. ఏడాది క్రితం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్మాన్ ఘాట్‌లో సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించాడు. అతను తన సేకరించిన నమూనాలను పంపడానికి, కరోనా (Coronavirus) పరీక్షల నివేదికలను పొందడానికి Madcis Pathlabs ఇండియాతో టైఅప్ అయ్యాడు. నిందితులు కిట్‌లను చించి, డమ్మీ నమూనాలను Madcis Pathlabs పంపారు. నెగెటివ్ రిపోర్టులు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.2,000-రూ.3,000 వరకు డబ్బులు వసూలు చేశాడు. హైదరాబాద్ పోలీసులు లక్ష్మణ్ నుంచి 65 నకిలీ ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికెట్లు, 20 శాంపిల్స్ సేకరణ కిట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
రెండవ కేసులో, అరెస్టయిన వ్యక్తి MD తారిక్.. గతంలో వివిధ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశాడు, సంవత్సరం క్రితం ఆసిఫ్ నాగాలోని మురాద్ నగర్‌లో తన స్వంత డయాగ్నస్టిక్ సెంటర్ "ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్"ని ప్రారంభించాడు. వివిధ పరీక్షలకు సంబంధించి పలు ప్రయోగశాలలతో భాగస్వామ్యం చేసుకున్నాడు. అయితే, అఫ్జల్ సాగర్‌లో కంప్యూటర్ ఆపరేటర్ అయిన కుమారి తో కలసి తారిఖ్.. కరోనా (Coronavirus) ఫిజికల్ డోస్ లేకుండానే వినియోగదారులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందించడం ప్రారంభించే నకిలీ దందాకు తెరలేపాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు కోవిడ్-19 (Coronavirus) నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు, ఫేక్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టులు అందించడానికి ఒక్కో దానికి రూ.800 నుంచి రూ.1000 వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి 50 నకిలీ కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ సర్టిఫికేట్లు, 10 RT-PCR రిపోర్టులు (RT-PCR test reports), 2 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.