మిర్చి రైతులకు పరిహారం చెల్లించండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

By Rajesh KFirst Published Jan 21, 2022, 7:10 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్‌ రెడ్డి (revanth reddy) శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్‌ రెడ్డి (revanth reddy) శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. మిగతా పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని .. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్చి పంట (mirchi crop) మంచిగా పడితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడిని పెట్టారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కానీ తామర తెగులుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ముఖ్యమంత్రి.. జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి దాదాపు 8.633 కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారో రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని వెల్లడించారు.

కాగా.. టీపీసీసీ చీఫ్ Revanth Reddy  మంగళవారం నాడు  మీడియా ప్రతినిధులతో Chit chat చేశారు.Telangana Cabinet లో ప్రభుత్వ స్కూల్స్ లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకొంది.అయితే ఈ విషయమై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చట్టం రూపొందించనున్నారు.

ఈ విషయమై ఇవాళ రేవంత్ రెడ్డి  చిట్ చాట్ లోస్పందించారు. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ విద్యాసంస్థల్లో  ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా ఇంగ్లీష్ మాధ్యం ఎలా బోధిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేజీ టూ పీజీ విద్యా విధానం అమలు కావాలంటే టీచర్ పోస్టులను భర్తీ చేయాలనే విషయం కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.  తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. విద్యా హక్కు చట్టం అమల్లో ఉన్నా  అమలు కాని విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారంగా ప్రైవేట్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు 25 శాతం ఉచితంగా ఆడ్మిషన్లు ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు.

click me!