తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు.. కొత్తగా 4,416 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీలో అత్యథికం

Published : Jan 21, 2022, 09:26 PM IST
తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు.. కొత్తగా 4,416 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీలో అత్యథికం

సారాంశం

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,243 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,26,819కి చేరింది.

తెలంగాణలో (corona cases in telangana) కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,243 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,26,819కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో (covid deaths in telangana) వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,069కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 1,920 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 1670 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 88, జీహెచ్ఎంసీ 1670, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్ భూపాలపల్లి 36, గద్వాల 50, కామారెడ్డి 40, కరీంనగర్ 91, ఖమ్మం 117, మహబూబ్‌నగర్ 99, ఆసిఫాబాద్ 32, మహబూబాబాద్ 70, మంచిర్యాల 92, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 417, ములుగు 27, నాగర్ కర్నూల్ 72, నల్గగొండ 90, నారాయణపేట 36, నిర్మల్ 36, నిజామాబాద్ 75, పెద్దపల్లి 73, సిరిసిల్ల 44, రంగారెడ్డి 301, సిద్దిపేట 73, సంగారెడ్డి 99, సూర్యాపేట 59, వికారాబాద్ 63, వనపర్తి 46, వరంగల్ రూరల్ 70, హనుమకొండ 178, యాదాద్రి భువనగిరిలో 89 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం (tamilnadu govt) ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. బస్, రైల్వే స్టేషన్‌, విమానాశ్రయాల వద్దకు వెళ్లే ఆటోలు, ట్యాక్సీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. గురువారం తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదవ్వగా... 39 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాన కేసుల సంఖ్య 30 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 37 వేలకు పైనే ఉంది. ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మందికి ప్రికాషనరీ డోసు అందజేయాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. 

అటు థర్డ్ వేవ్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రం (kerala) సైతం వచ్చే రెండు ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించుకుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. జనవరి 23, జనవరి 30 తేదీల్లో ఈ లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గురువారం కేరళలో 46 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.  మరోవైపు కర్ణాటక (karnataka) మాత్రం ఆంక్షలను కాస్త సడలించింది. వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసింది. అయితే రాత్రి ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. మాల్స్‌, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు 50 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.  

PREV
click me!

Recommended Stories

Medaram Jathara 2026 : మేడారంకు ఎక్కడెక్కడి నుండి ఆర్టిసి బస్సులుంటాయి.. ఎక్కడి నుండి ఎంత ఛార్జీ..?
Teacher Suspend for Making Reels:పాటలుపాడలేదు పాఠాలునేర్పించా.. బోరుమన్న టీచర్ | Asianet News Telugu