శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో మరో​ ట్విస్ట్‌.. మంత్రితో సహా 19 మందికి కోర్టు నోటీసులు..

By Bukka Sumabala  |  First Published Aug 5, 2022, 12:24 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మంత్రితో సహా 19మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నట్లయ్యింది. 


మేడ్చల్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది, శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్ నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. తన ఇంట్లో సీసీటీవీ, హార్డ్ డిస్కులను దొంగిలించారని రాజు పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్ ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేసింది. హత్యకు కుట్రకేసులో గతంలో రాజు,  విశ్వనాథ్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటికి వచ్చాక మహబూబ్నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 27న  టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా హైదరాబాదులోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన పార్టీ ప్లీనరీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ సీనియర్ నేత మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. అంతే కాదు పార్టీ నేతలతో కలిసి ఫోటోలు కూడా దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది. ప్లీనరీకి హాజరయ్యే నేతలకు సెక్యూరిటీ బార్కోడ్ ఉన్న పాస్ లను జారీ చేసింది టీఆర్ఎస్. ఈ పాస్ లు ఉన్నవారే ప్లీనరీకి హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. 

Latest Videos

undefined

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు..!

అయితే మున్నూరు రవికి ఈ పాసు లేకున్నా అతడు పార్టీ ప్లీనరీకి ఎలా హాజరయ్యారు అన్న విషయం అంతుచిక్కకుండా ఉంది. అయితే కేవలం పార్టీ ఐడీ కార్డుతోనే మున్నూరు రవి పార్టీ ప్లీనరీకి హాజరయ్యారని ఆ తర్వాత తెలిసింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవి వ్యవహారం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. కాగా, మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి శ్రీనివాస్గౌడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పథకం ప్రకారం ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని రాఘవేంద్ర రాజు కుటుంబం ఆరోపిస్తోంది. 

ఆర్థికంగా దెబ్బ తినడంతో పాటు తమ కుటుంబ సభ్యుల అరెస్టు వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని రాఘవేందర్ రాజు సోదరులు భావించారు. దీనిలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. రాఘవేంద్ర రాజు కుటుంబానికి ఉన్న ఆధార్ సెంటర్ తో పాటు బార్ ను నడవకుండా చేయడంలో పరోక్షంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించినట్లుగా రాఘవేంద్ర రాజు సోదరులు అనుమానించారు. ఆనంద్, హైదర్ అలీ, శ్రీకాంత్ గౌడ్ లు తమను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా రాఘవేంద్ర రాజు సోదరులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. 

click me!