ఇక రేవంత్ ముఖం చూడను: చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరికపై మండిపడ్డ కోమటిరెడ్డి

By narsimha lode  |  First Published Aug 5, 2022, 12:14 PM IST

తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మండిపడ్డా,రు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖం ఇక చూడబోనన్నారు. 



న్యూఢిల్లీ: Cheruku Sudhakar ని పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్ఝున ఖర్గే సమక్షంలో చెరుకు సుధాకర్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ కీలకపాత్ర పోసించిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.  

ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు.. ఇక నుండి తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని చెప్పారు.  పార్లమెంట్ సమావేశాల తర్వాత తాను మునుగోడుకు వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  
 

Latest Videos

click me!