ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలలో అసలు తెలంగాణ లేనప్పుడు, తెలంగాణ ప్రజల ప్రాధాన్యత క్రమంలో మోడీ ఎందుకు వుండాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి నిలదీశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం జరిగిన నాటి నుంచి బీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మేరకు గురువారం బండి సంజయ్ ట్వీట్ చేశారు. దొరవారి గడుల్లో నలిగిపోయిన న్యాయమా అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ దేశంలోనే అత్యధిక వేతనం (నెలకు రూ.4.1 లక్షలు) అందుకునే సీఎం అన్న ఆయన.. కేసీఆర్ కొడుకు పరువు విలువ రూ.100 కోట్లని, కేసీఆర్ బిడ్డ వాచ్ విలువ రూ.20 లక్షలని .. మరి అత్యాచారం, ర్యాగింగ్, కుక్కల చేతుల్లో చనిపోయిన పిల్లలు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో నష్టపోయిన అభ్యర్ధుల జీవితాల విలువ ఎంతని బండి సంజయ్ ప్రశ్నించారు.
Highest paid CM is KCR - ₹4.1lakh per month
KCR son’s image - ₹100crore
KCR daughter’s watch - ₹20lakh
What is the worth of victims of rape, ragging , kids mauled by dogs, TSPSC paper leakage ?
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా!
ఆ వెంటనే మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై గట్టి విమర్శలు చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, మెట్రో రెండో దశలు, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వమని మోడీ చెప్పారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని ప్రాధాన్యతలలో అసలు తెలంగాణ లేనప్పుడు, తెలంగాణ ప్రజల ప్రాధాన్యత క్రమంలో మోడీ ఎందుకు వుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని మంత్రి నిలదీశారు.
తెలంగాణకు...
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని…
Also REad : పరువుకు 100 కోట్లా.. మరి నిరుద్యోగులకి నువ్వెంత కట్టాలి, లీగల్‌గానే వెళ్తా : కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్
ఇదిలావుండగా.. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు బండి సంజయ్. నీ పరువుకే రూ.100 కోట్లయితే .. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్ధకమైందన్నారు. మరి వాళ్లకెంత మూల్యం చెల్లిస్తావని బండి సంజయ్ ప్రశ్నించారు. లీకేజ్‌లో తన కుట్ర వుందన్న నీపై ఎంత దావా వేయాలని ఆయన నిలదీశారు. నీ ఊడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని.. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి వేల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేపేవరకు పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు కేటీఆర్ మంగళవారంనాడు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రూ, 100 కోట్లకు పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కేటీఆర్ ఆ నోటీసులో పేర్కొన్నారు.