తెలంగాణలో రికార్డు: నేడు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం

By narsimha lode  |  First Published Mar 30, 2023, 5:23 PM IST

తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో విద్యుత్  వినియోగం  చోటు  చేసుకుంది. 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్టుగా  అధికారులు  ప్రకటించారు.  


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గురువారంనాడు  అత్యధికంగా  విద్యుత్ వినియోగించినట్టుగా రికార్డు నమోదైంది.  ఇవాళ ఉదయం  11:01 గంటలకు 15,497 మె.వా.విద్యుత్ వినియోగించారు.  రాష్ట్ర చరిత్రలో  ఇదే  అత్యధికంగా  అధికారులు చెబుతున్నారు.  ఈ నెల  ఆరంభం  నుండి  15 వేల మెగావాట్ల  విద్యుత్ వినియోగిస్తున్నారు. 

2022 మార్చి  28న  తెలంగాణ రాష్ట్రంలో 13, 867 మెగావాట్ల విద్యుత్ వినియోగం  జరిగింది.  గత ఏడాది  మార్చి మాసంలో   13 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం  రికార్డు.  ఈ ఏడాది విద్యుత్ వినియోగం గత ఏడాదిని మించిపోయింది. 

Latest Videos

undefined

ఈ నెల 14న  తెలంగాణలో  15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు.  దక్షిణాది  రాష్ట్రాల్లో అత్యధికంగా  విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రాలతో  తెలంగాణ పోటీ పడుతుంది.  అత్యధికంగా విద్యుత్ వినియోగిస్తున్న  రాష్ట్రాల్లో  తమిళనాడు మొదటి స్థానంలో  నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో  తెలంగాణ నిలిచింది.  

వరి పంటకు  అవసరమైన నీటిని అందించేందుకు  రైతులు విద్యుత్ ను  ఎక్కువగా వినియోగిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత  విద్యుత్ వినియోగం  పడిపోయే అవకాశం ఉందని  అధికారులు అభిప్రాయపడుతున్నారు.  రాష్ట్ర ప్రజల డిమాండ్  మేరకు  విద్యుత్  సరఫరా చేస్తామని  అధికారులు  చెబుతున్నారు. 
 

click me!