ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 10 శాతం డిస్కౌంట్..

Published : Apr 13, 2023, 04:52 PM IST
ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ  గుడ్ న్యూస్.. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 10 శాతం డిస్కౌంట్..

సారాంశం

తెలంగాణ  ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది.

హైదరాబాద్‌: తెలంగాణ  ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. 10 శాతం రాయితీ కల్పించనున్నట్టుగా తెలిపింది. హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో టీఎస్‌ఆర్టీసీ.. సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ 10 శాతం తగ్గింపు ఏప్రిల్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ తగ్గింపు వల్ల హైదరాబాద్- విజయవాడ మార్గంలో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఒక్కొక్కరికి రూ.40 నుంచి రూ.50 వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. 

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను  కోరారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ  వీసీ సజ్జనార్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. 

‘‘”విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. వారి టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల ౩౦ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. ప్రయాణికులు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌  www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu