వినూత్నంగా ఆత్మీయ సమ్మేళనం.. కుటుంబ సమేతంగా తరలివచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి.. 

Published : Apr 13, 2023, 04:04 PM IST
వినూత్నంగా ఆత్మీయ సమ్మేళనం.. కుటుంబ సమేతంగా తరలివచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి.. 

సారాంశం

సూర్యపేట నియోజకవర్గం చివ్వేంల మండలంలోని  బీబీగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తరలి వచ్చారు

Jagadish Reddy:  పార్టీ పటిష్టం కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్న వారికి భరోసానివ్వడానికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆత్మీయ సమ్మేళనాల వేదికగా రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్థం చేయడంతోపాటు ప్రజాసంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలను, మనోగతాలను పంచుకునేందుకే ఈ సమ్మేళనాలు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో దశలవారీగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 

గత వారం, పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా BRS ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు రాజకీయం గుప్పుమంటుంది.  కానీ, రాజకీయ సభలకు భిన్నంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సూర్యపేట నియోజకవర్గం చివ్వేంల మండలంలోని  బీబీగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం..  రాజకీయ కార్యక్రమంగా కాకుండా.. ఓ పెండ్లి వేడుకగా.. ఓ పండుగలా.. వనభోజన మహోత్సవంలా.. మరోలా చెప్పాలంటే ఓ  జాతరలా సాగింది. ఈ సమ్మేళనంలో నిజంగానే  ఆత్మీయ భావం పరిమళించింది.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మనవళ్లు,మనువారండ్రా తో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్ కూడా తన సతీమణి సునీతా రెడ్డి,తనయుడు వేమన్ రెడ్డితో హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి.. అల్పాహారం తీసుకున్నారు. ఈ సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కార్యకర్తలు కుటుంబాల వారిగా ఫోటోలు దిగారు. ఈ క్రమంలో చివ్వేంల, ఐలాపురం,అక్కలదేవి గూడెం,గాయం వారిగూడెం, యం జి నగర్ తాండా, మున్యా నాయక్ తాండా,పాండ్యానాయక్ తండా,రాజు తాండా,రోళ్లబండ తాండా,సూర్యనాయక్ తాండాలోని కార్యకర్తలు పాల్గొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu