కరీంనగర్ లో విషాదం... యువకుడి ప్రాణంతీసిన ఈత సరదా

Published : Apr 13, 2023, 04:40 PM IST
కరీంనగర్ లో విషాదం... యువకుడి ప్రాణంతీసిన ఈత సరదా

సారాంశం

మండుటెండల నుండి సేదతీరేందుకు సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది,

కరీంనగర్ :ఎండలు మండిపోతుండటంతో నీటికుంటలు, రిజర్వాయర్లలో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకున్ని ఈత సరదా బలితీసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు నీటమునిగి మృతిచెందాడు. 

పెద్దపల్లి జిల్లాకు చెందిన నీలపు బాలరాజు(18) తిమ్మూపూర్ లో చదువుకుంటున్నాడు. ప్రైవేట్ డిప్లొమా కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న అతడు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళాడు. 20 మంది స్నేహితులు ఎల్ఎండి రిజర్వాయర్ గుంతలో ఈతకు దిగిన బాలరాజు లోతులోకి వెళ్లి మునిగిపోయాడు.ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయిన బాలరాజును కాపాండేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  

Read More  Hyderabad : రంజాన్ పండక్కిముందు విషాదం... కరెంట్ షాక్ తో సోదరులు సహా ముగ్గురి మృతి

బాలరాజు నీటమునిగడంతో కంగారుపడిపోయిన స్నేహితులు స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గజ ఈతగాళ్ళ సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

చదువుకోడానికి వెళ్లిన కొడుకు ఇలా ప్రమాదవశాత్తు మృతిచెందండంలో బాలరాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తోటి విద్యార్థులు కూడా బాలరాజు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.

PREV
click me!

Recommended Stories

మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu
World Cancer Day: క్యాన్స‌ర్‌ను జ‌యించ‌డం పెద్ద క‌ష్టమేమి కాదు.. వీరి క‌థ‌లు వింటే మీరూ ఇదే అంటారు.