అభ్యర్ధులకు శుభవార్త : గ్రూప్ 2 పరీక్షలు రీ షెడ్యూల్ , టీఎస్‌పీఎస్సీ సంచలన ప్రకటన.. కొత్త డేట్లు ఇవే

By Siva KodatiFirst Published Aug 13, 2023, 5:36 PM IST
Highlights

గ్రూప్ 2 అభ్యర్ధులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 పోస్టులను నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కమీషన్ ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్లు అందుబాటులో వుంచుతామని తెలిపింది. 

గ్రూప్ 2 అభ్యర్ధులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 పోస్టులను నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కమీషన్ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు వుంటాయని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29, 30న గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి వుంది. అయితే ఇటీవల అభ్యర్ధుల ఆందోళనల నేపథ్యంలో పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్లు అందుబాటులో వుంచుతామని తెలిపింది. 

అంతకుముందు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఈ పరీక్ష వాయిదా వేయాలని సూచించినట్టు వివరించారు. అంతేకాదు, భవిష్యత్‌లోనూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసేటప్పుడు ఒకేసారీ అన్నింటినీ విడుదల చేయకుండా తగిన వ్యవధి ఇస్తూ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధులు కావడానికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ సూచనలు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Latest Videos

Also Read: TSPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష నవంబర్‌కు వాయిదా

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని, ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఉండటం లేదని గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నెలలో వరుసగా గురుకులాలు, జేఎల్, డీఎల్ పరీక్షలు ఉన్నాయి. వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష కూడా ఉన్నది.  ఇదిలా ఉండగా ఈ నెల చివరిన 29వ, 30వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలకు సిలబస్‌లు కూడా వేర్వేరుగా ఉన్నాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయం ఉండటం లేదు. 

జేఎల్, డీఎల్ పరీక్షలకు ప్రిపేర్ అయినవారు గ్రూప్ 2 కోసం మళ్లీ వేరే సిలబస్ చదవాల్సి వస్తున్నది. అయితే, వరుసగా నోటిఫికేషన్లు విడుదల కావడం, వరుసగా పరీక్షలు ఉండటంతో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం ఉండటం లేదు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసి ఆ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తగిన సమయం అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.


 

click me!