టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన.. ఉచిత ప్రయాణానికి ఇక అవి తప్పనిసరి.. లేకపోతే రూ.500 ఫైన్..

By Sairam Indur  |  First Published Jan 8, 2024, 5:09 PM IST

టీఎస్ ఆర్టీసీ (TS RTC)లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఇక ఒరిజినల్ ఐడీ కార్డులు ( original id cards) తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ (TS RTC MD V.C Sajjanar)తెలిపారు. అవి లేకపోతే డబ్బులు చెల్లించి టిక్కెట్ తీసుకోవాలని కోరారు.


టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మరో సారి  విజ్ఞప్తి చేశారు. చాలా మంది మహిళలు బస్సులో ప్రయాణించే సమయంలో ఒరిజినల్ పత్రాలను చూపించడం లేదని అన్నారు. జిరాక్స్ కాపీలను చూపిస్తున్నారని తెలిపారు. దయచేసి అలా చేయకూడదని కోరారు. మహిళా ప్రయాణికులు ఒరిజినల్ గుర్తింపు పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని అన్నారు. 

సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లోకి అక్రమ చొరబాటు.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు..

Latest Videos

ఈ మేరకు సోమవారం ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో సుధీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘‘ మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్‌ కార్డులో అడ్రస్ ఉండదు. కాబట్టి అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ’’ అని ఆయన పేర్కొన్నారు. 

వెంటనే మసీదులు ఖాళీ చేయండి.. లేకపోతే - బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు..

‘‘ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో ఫొటోలను చూపించడం, అలాగే జిరాక్స్ కాపీలు చూపించడం, కలర్‌ జిరాక్స్ లు చూపించడం చేస్తున్నారని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని వల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలి.’’ అని తెలిపారు.

బాబ్రీ మసీదుపైనే రామాలయం.. ప్రారంభోత్సవాన్ని ముస్లింలు వ్యతిరేకించాలి - ఖలిస్తానీ నేత సంచలన వ్యాఖ్యలు..

‘‘ఎలాగూ బస్సు ప్రయాణం ఉచితమే కదా.. మరి జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడమని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరైనది కాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే..  సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతీ మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. దానిని చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. దీంతో పాటు సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు.

మళ్లీ షేక్ హసీనాకే బంగ్లాదేశ్ పగ్గాలు.. ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం..

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ గ్యారెంటీ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ ఉచిత బస్సు హామీని అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో సుమారు 6.50 కోట్ల మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందారని టీఎస్ ఆర్టీసీ పేర్కొంది.

click me!