తెలంగాణలో జిల్లాలు తగ్గుతాయా, పెరుగుతాయా?: అధికారులతో కమిటీ ఏర్పాటు యోచనలో రేవంత్

By narsimha lode  |  First Published Jan 8, 2024, 3:59 PM IST

తెలంగాణలో  జిల్లాల విభజన అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.  33 జిల్లాల్లో మార్పులు చేర్పులుంటాయా అనే విషయమై  చర్చ ప్రారంభమైంది.
 



హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలపై  అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఏం చేయనుందనే  చర్చ ప్రస్తుతం  తెరమీదికి వచ్చింది.  2014లో  తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది.  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  సర్కార్  జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  సమయంలో   తొమ్మిది జిల్లాలను  33 జిల్లాలకు పెంచారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సమయంలో  భాగంగా కొత్త మండలాలు, రెవిన్యూ డివిజన్ల  ఏర్పాటు విషయంలో  కూడ అనేక ఆందోళనలు జరిగాయి.  కొత్త జిల్లాల ఏర్పాటు  ప్రక్రియ హేతుబద్దంగా లేదనే అభిప్రాయంతో  రేవంత్ రెడ్డి  సర్కార్ ఉందని ప్రచారం సాగుతుంది. 

Latest Videos

undefined

రెండు రోజుల క్రితం  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో  కొత్త జిల్లాల ఏర్పాటు  విషయమై  కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి  చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో  ఈ విషయమై  చర్చ పెడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2009లో  నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అదే తరహాలో  ప్రస్తుతం  ఉన్న జిల్లాలను హేతుబద్దంగా  విభజించాలని రేవంత్ రెడ్డి సర్కార్  భావిస్తుంది.   ఇందు కోసం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.ఈ కమిటీకి  కొన్ని మార్గదర్శకాలను  అందించనున్నారు. ఈ మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై  ఈ కమిటీ చేసే  సూచనల మేరకు  నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

అయితే  జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో  ప్రతిపాదించాలని  రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.  ఈ విషయమై  ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత   ఏం చేయాలనే దానిపై  రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది .

also read:తెలంగాణకు మోడీ: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

జిల్లాల విభజన విషయంలో  కేసీఆర్ సర్కార్ సరిగా వ్యవహరించలేదనే అభిప్రాయంతో  కాంగ్రెస్ సర్కార్ ఉంది. దీన్ని  సరి చేయాలనే అభిప్రాయంతో ఉన్నారని  ప్రచారం సాగుతుంది. అయితే  కాంగ్రెస్ సర్కార్ జిల్లాల విషయంలో  కదిపితే  తేనేతుట్టెను కదిపినట్టు అవుతుందా... లేదా   అనేది కాలం తేల్చనుంది. 

click me!