ఎమ్మెల్యేల ఇళ్లు మాత్రం రెడీ !

Published : Mar 01, 2017, 01:19 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఎమ్మెల్యేల ఇళ్లు మాత్రం రెడీ !

సారాంశం

పేదల కోసం ఉద్దేశించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న సమయంలో  ఎమ్మెల్యేల ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి కానరాలేదు.

సామాన్యుడి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా కాగితాలలో కూడా పూర్తి కాలేదు. కానీ, ప్రజాప్రతినిధులు నివాస గృహాలు అప్పుడే ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నాయి.

 

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు  కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 

దీంతో ప్రతి నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం అంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధవహించి రికార్డు స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేశారు.

 

రాష్ట్రంలోనే తొలిసారిగా  వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నియోజకవర్గం కేంద్రంలో రూ.69 లక్షల వ్యయంతో భవన సముదాయం సిద్ధమైంది. రేపు ఈ భవనాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్‌ ప్రారంభించనున్నారు.


అయితే పేదల కోసం ఉద్దేశించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న సమయంలో  ఎమ్మెల్యేల ఇళ్ల విషయంలో అలాంటి పరిస్థితి కానరాలేదు. రికార్డు స్థాయిలో కేవలం 6 నెలల లోపే నిర్మాణాలన్నీ పూర్తి చేశారు. మరికొన్ని నెలలో అన్ని నియోజవర్గాల్లో ఎమ్మెల్యేల ఇంటి నిర్మాణాలు పూర్తికావొచ్చని సమాచారం.

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!