ఫ్లెక్క్సీలో తన ఫొటో పెట్టలేదని...

Published : Mar 01, 2017, 12:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఫ్లెక్క్సీలో తన ఫొటో పెట్టలేదని...

సారాంశం

కలెక్టర్ తో వాగ్వివాదానికి దిగిన ఎమ్మెల్యే రసమయి

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

 

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా పాఠలతో సమాధానం చెప్పే ఈ ఎమ్మెల్యేకు కోపమెచ్చింది. అది కూడా ఫ్లెక్స్సీలో తన ఫొటో పెట్టలేదన్న కారణంతో... దీనిపై ఏకంగా జిల్లా కలెక్టర్ నే నిలదీశాడు.

 

కరీంనగర్ లో ఈ రోజు డిజీధన్ మేళా నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి ఈటల రాజేందర్, నీతిఆయోగ్ డైరెక్టర్ నీరజ్ శ్రీవాస్తవ, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమాలకర్ తదితరులు హాజరయ్యారు.

 

అయితే వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తన ఫోటోలు పెట్టలేదని, ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ వేదిక పైకి రాలేదు.

అయితే ఈ విషయం గురించి తన వద్ద మాట్లాడొద్దని జిల్ కలెక్టర్ సర్పరాజ్ వారికి సూచించారు. ఈ సందర్భంలో కలెక్టర్ .... రసమయి వైపు వేలు చూపించి మాట్లాడటం వివాదానికి కారణమైంది.

 

నాకే వేలు చూపిస్తావా అంటూ కలెక్టర్‌పై రసమయి నిప్పులు చెరిగారు. ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేలను అవమానిస్తారా అని నిలదీశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!