TS EAMCET 2022 : టీఎస్ ఎంసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్..

By team teluguFirst Published Aug 19, 2022, 11:29 AM IST
Highlights

తెలంగాణ ఎంసెట్-2022 పరీక్ష రాసిన విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఎంసెట్ -2022 (TS EAMCET 2022) కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. దీనిని త‌న‌ అధికారిక వెబ్‌సైట్  లో (tseamcet.nic.in)లో దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఉంచింది. అభ్యర్థులు ఇప్పుడు TS EAMCET అధికారిక సైట్ నుండి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను MPC స్ట్రీమ్ విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చిన‌ట్టే మార్చారు - నితీష్ కుమార్ పై కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యలు

మొదటి దశ నమోదు ప్రక్రియ ఆగస్ట్ 21న ప్రారంభమ‌వుతుంది. ఇది ఆగస్టు 29వ తేదీన ముగుస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 23 నుండి ఆగస్ట్ 30 వ‌ర‌కు కొన‌సాగుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్‌లు ను ఇచ్చేందుకు విద్యార్థుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. 

న‌డిరోడ్డుపై మద్యం స్టంట్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాబీ కటారియా అరెస్టుకు రంగంసిద్ధం

కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం.. ఆప్షన్ ఫ్రీజింగ్ తేదీ సెప్టెంబర్ 2న జరుగుతుంది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన టెంప‌ర‌రీ సీట్ల కేటాయింపు చేస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయ‌వ‌చ్చు.

ప్రేయసి కోసం బుర్కా వేసుకున్న ప్రియుడు... కట్ చేస్తే..అతడికి జరిగింది తెలిస్తే షాక్...

రెండో ద‌శ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 10 వరకు కొన‌సాగుతుంది. చివరి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 21, 2022 వరకు చేప‌డుతారు. స్పాట్ అడ్మిషన్లు అక్టోబర్ 20వ తేదీ నుంచి నిర్వ‌హించ‌నున్నారు.  

click me!