అమిత్ షా టూర్ షెడ్యూల్ లో మార్పులు : చౌటుప్పల్ సభ తర్వాత ఫిల్మ్ సిటీకి

By narsimha lodeFirst Published Aug 19, 2022, 10:38 AM IST
Highlights

కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకొన్నాయి. చౌటుప్పల్ నుండి హైద్రాబాద్ తిరుగు ప్రయాణంలో మార్పులు జరిగాయి. చౌటుప్పల్  సభ నుండి రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకొంటారు అమిత్ షా. ఆ తర్వాత పార్టీ నేతలతో  సమావేశం కానున్నారు. 

హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో స్వల్ప మార్పులుచోటుచేసుకొన్నాయి.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో నిర్వహించే సభలో ఈ నెల 21న  అమిత్ షా పాల్గొంటారు.  అమిత్ షా ఢిల్లీ తిరిగి వెళ్లే టూర్ లో మార్పులు చోటు చేసుకొన్నాయి.  చౌటుప్పల్ సభలో పాల్గొన్న తర్వాత రోడ్డు మార్గంలో అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుుకుంటారు. అదే రోజు సాయంత్రం 6:45 నుండి 7:30 గంటల వరకు  ఫిల్మ్ సిటీలోనే అమిత్ షా ఉంటారు.  ఆ తర్వాత హోటల్ లో అమిత్ షా తెలంగాణకు చెందిన బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.  రాత్రి 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమిత్ షా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన  వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. 

ఈ నెల 21న మధ్యాహ్నం 1;20 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4:15 గంటలకు చౌటుప్పల్ కు చేరుకుంటారు.  సాయంత్రం 4:25 గంటలకు సీఆర్పీపీఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4:40  గంటల నుండి 6 గంటల వరకు  చౌటుప్పల్ సభలో పాల్గొంటారు. ఈ టూర్ లో మార్పు లేదు. కానీ తిరుగు ప్రయాణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 

చౌటుప్పల్ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ సబలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారు.ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాకు తన రాజీనామా లేఖను పంపారు.  ఈ నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్  రెడ్డి రాజీనామా సమర్పించారు.ఈ రాజీనామాను స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. దీంతో  ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.  2018లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 


 

click me!