కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

By narsimha lodeFirst Published Aug 6, 2019, 2:46 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన  బిల్లుకు తాము పూర్తిగా మద్దతును ిస్తున్నట్టుగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు. 

న్యూఢిల్లీ: కాశ్మీర్ విభజన బిల్లుకు  తమ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్టుగా టీఆర్ఎస్ ప్రకటించింది. మంగళవారం నాడు టీఆర్ఎస్ శాసనససభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మద్దతు  ఈ బిల్లుపై ప్రసంగించారు.

మంగళవారంనాడు లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లును  కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ  పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ప్రసంగించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా వ్యాఖ్యలను పూర్తిగా  సమర్ధిస్తున్నట్గుగా నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు.  కాశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించే పార్టీలను ప్రజలు దేశ ద్రోహులుగా చూస్తున్నారని నామా నాగేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లుతో కాశ్మీర్ ప్రజలకు తప్పకుండా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడ స్వాధీనం చేసుకోవాలని నామా నాగేశ్వర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.

జమ్మూకాశ్మీర్  రాష్ట్రంలో ఇక వేగంగా పారిశ్రామిక అభివృద్ది జరగనుందని  ఆయన  చెప్పారు. 15వ లోక్‌సభ సమయంలో తాను ఇతర పార్టీలతో కలిసి కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేసుకొన్నారు.

కాశ్మీర్ రాష్ట్రంలోని  పలు వర్గాలతో  చర్చలు జరిపిన విషయాన్నిఆయన గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగని విషయాన్ని ఆనాడు తమతో ప్రజలు చెప్పారని నామా నాగేశ్వర్ రావు ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

సంబరాలు: లడఖ్ ఆకాంక్షలు నెరవేరిన వేళ, ఎలా....

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

click me!