ఆత్మగౌరవం కాదు ఆస్తులపై గౌరవం: ఈటలకు టీఆర్ఎస్ కౌంటర్

By narsimha lodeFirst Published Jun 4, 2021, 12:42 PM IST
Highlights

ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదు, ఆస్తులపై గౌరవమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్: ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదు, ఆస్తులపై గౌరవమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.హైద్రాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో  శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈటల రాజేందర్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దె రకం మనస్థతత్వం ఉన్నవాడన్నారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల రాజేందర్ అభాండాలు వేశాడన్నారు. 19 ఏళ్లు ఈటల రాజేందర్ పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు అనుభవించారని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అనేక మంది నాయకులను తీర్చిదిద్దారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా సీనియర్ అయినా కూడ హరీష్ రావును పక్కన పెట్టి టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా 2004లో కేసీఆర్ బాధ్యతలు అప్పగించలేదా అని ఆయన ప్రశ్నించారు.

also read:బానిసను కాదు, ఉద్యమ సహచరుడిని: ఈటల రాజేందర్

గతంలోనే అవమానాలకు గురైతే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ఈటలను ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారి భూములు ఎలా కొనుగోలు చేస్తావని ఆయన ప్రశ్నించారు.  పార్టీలోకి వచ్చే సమయంలో కేసీఆర్ దేవుడు, వెళ్లేప్పుడు నియంత అంటారన్నారు. అందరు చేసే వ్యాఖ్యలనే రాజేందర్ కూడ చేశాడన్నారు.చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకొన్నారని ఆయన విమర్శించారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. హుజూరాబాద్ లో ఓటమిని ఈటల  ముందే ఒప్పుకొన్నారని చెప్పారు.

also read:ఈటెల రాజేందర్ ఆలోచన: హుజూరాబాద్ బరిలో భార్య జమున?

ఈటల రాజేందర్ వెనుక కొద్దిమంది అసంతృప్తులు మాత్రమే ఉన్నారని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను ఈటల రాజేందర్ కోరిక మేరకు తప్పించారని  పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.కరోనాపై సమీక్ష సమావేశాల్లో ఈటల రాజేందర్ లేకుండా ఏనాడూ కేసీఆర్ రివ్యూ చేయలేదని చెప్పారు.రైతులను హింసిస్తున్న బీజేపీలో రాజేందర్ ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. 
 

click me!