టీఆర్ఎస్ కు మరో షాక్... పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

By Arun Kumar PFirst Published Jun 4, 2021, 12:09 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పటికే మాజీ మంత్రి రాజీనామా ప్రకటించగా తాజాగా మరో కీలక నేత కూడా రాజీనామా ప్రకటించి షాకిచ్చారు. ఈటల రాజీనామా ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య కూడా రాజీనామా చేశారు. ఈటల బాటలోనే నడుస్తూ టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు బాబయ్య వెల్లడించారు. 

ఇదిలావుంటే కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్లపాటు టీఆర్ఎస్‌తో తనకు  ఉన్న అనుబంధాన్ని ఇవాళ్టితో వీడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో  తాను కూడ ఒకడినని ఆయన చెప్పారు. 2014 కంటే ఎక్కువ మెజారిటీతో హుజూరాబాద్ నుండి తాను విజయం సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎంపీ పదవికి కవితతో పాటు చాలా మంది టీఆర్ఎస్ నేతలు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. 

read more  టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా

ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడ చివరి కోరిక ఏమిటని కూడ అడుగుతారన్నారు.  కానీ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కనీసం తనను వివరణ అడగకుండానే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికే రాత్రికే మంత్రివర్గం నుండి తొలగించారని ఆయన గుర్తు చేశారు. ఎవరో అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరిపారన్నారు. ఈ విషయమై కనీసం తన వివరణ కూడ అడగలేదన్నారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వంద శాతం ప్రజా ప్రతినిధులను గెలిపించుకొన్నామన్నారు. ప్రజల హృదయాల్లో  స్థానం సంపాదించుకొన్నానని ఆయన చెప్పారు.   హుజూరాబాద్ ప్రజల మద్దతు తనకు ఉందన్నారు.  పార్టీ ఏ పదవి అప్పగించినా తన  శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేశానని ఆయన చెప్పారు. అయితే ఎక్కడా తాను బిజెపిలో చేరనున్నట్లు ఈటల ప్రకటించలేదు... కానీ అందుకోసం రంగం సిద్దం చేసుకున్నాకే రాజీనామా ప్రకటన చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


 

click me!