
టీఆర్ఎస్ (trs) సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (kadiyam srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి (bjp) వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో (up election 2022) అఖిలేష్ యాదవ్ దెబ్బకు (akhilesh yadav) బీజేపీ ఓడిపోతుందని శ్రీహరి అన్నారు. పంజాబ్‌లో (punjab election 2022) ఆప్ (aap) చేతిలో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (chandigarh municipal corporation election ) ఆప్ (aap) చేతిలో బీజేపీ ఓటమి పాలైన విషయాన్ని కడియం శ్రీహరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ (narendra modi), అమిత్ షా (amit shah) కాళ్లు విరగడం ఖాయమని దుయ్యబట్టారు. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ ప్యాకేజీలు ప్రకటించిడం బీజేపీకి అలవాటైందని కడియం శ్రీహరి విమర్శించారు.
ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవుతూ వస్తుందని ఆయన చురకలు వేశారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైందని .. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారం సాధించారని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. కేసీఆర్ ఎక్కడ యాంటీ బీజేపీ కూటమి ఏర్పాటు చేస్తారనే భయం బీజేపీకి పట్టుకుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా యాంటీ బీజేపీ పార్టీలన్నీ ఏకమవుతాయని కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
ALso REad:ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దు: కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాల్సిన బీజేపీ నాయకులు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని… రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా తేలేని బీజేపీ నేతలు ఎందుకు ఎగిరిపడుతున్నారని ఆయన ఫైరయ్యారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని కూడా బీజేపీ నేతలు సాధించలేకపోయారని కడియం శ్రీహరి విమర్శించారు. బండి సంజయ్ (bandi sanjay) , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) వల్ల తెలంగాణకు ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదని ఆయన మండిపడ్డారు.
దేశంలో సంక్షేమ పథకాల్లో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని శ్రీహరి ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ మంత్రులే ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని..రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ కట్టుబడిందని శ్రీహరి స్పష్టం చేశారు. 8 విడతల్లో 80 వేల కోట్లను రైతుబంధు కింద ఇచ్చామని... ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం కేసీఆర్‌కే సాధ్యం అని కడియం శ్రీహరి ప్రశంసించారు.