
హుస్నాబాద్ (husnabad mla) టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు (satish kumar) చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా (siddipet district) అక్కన్నపేట మండలం (akkannapet mandal ) గుడాటిపల్లిలో నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు (gouravelli project)కారణంగా భూములు కోల్పోయిన వారు గుడాటిపల్లిలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆ శిబిరానికి వెళ్లిన సతీశ్ కుమార్.. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన మాటలను నిర్వాసితులు పట్టించుకోలేదు.
అంతేకాదు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిర్వాసితులు నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలు పరిష్కరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సతీశ్ కుమార్ వెనుదిరిగారు. కాగా, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల పోరాటానికి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.