Telangana: ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న బీజేపీ.. టీఆర్ఎస్ లీడ‌ర్ల ఆగ్ర‌హం !

Published : Feb 03, 2022, 12:44 PM IST
Telangana: ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న బీజేపీ.. టీఆర్ఎస్ లీడ‌ర్ల ఆగ్ర‌హం !

సారాంశం

Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎ  కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, టీఆర్ఎస్ నేత‌లు వాటిని తిప్పికొడుతూ.. బీజేపీ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. 

Telangana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బ‌డ్జెట్ పై తెలంగాణకు పెద్దగా కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌(chief minister K.Chandrasekhara Rao) పై దేశద్రోహం కేసు పెట్టాల‌ని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్‌ తరం కాదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త రాజ్యాంగాన్ని మార్చాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన డిమాండ్  రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అగౌరవపరచడమేనని ఆరోపించారు. గురువారం నాడు కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ మౌన దీక్ష‌కు సైతం దిగారు. 

అయితే, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (chief minister K.Chandrasekhara Rao) వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేత‌లు కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోతుండ‌గా, టీఆర్ఎస్ నేత‌లు మాత్రం బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. ప్రస్తుత రాజ్యాంగానికి అనేక సవరణలు చేశామని, అలాంటి ప్రతిపాదన కొత్తది కాదని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కొత్త రాజ్యాంగం ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ విషయంలో అవగాహన లేకుండా అర్ధంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను మోడీ ప్రభుత్వం అణచివేసి, ఎన్నికల ప్రాతిపదికన మాత్రమే వివిధ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన స్పష్టం చేశారు.

గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు కమిషన్‌ను నియమించారని వినోద్ గుర్తు చేశారు. గతంలో కేంద్రంలోని ప్రభుత్వాలు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను పరిశీలించేందుకు జస్టిస్ రాజమన్నార్ కమిషన్ మరియు జస్టిస్ సర్కారియా కమిషన్‌లను నియమించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సందర్భం, చరిత్రపై అవగాహన లేదని, ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులపై సంబంధిత రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. గోదావరి నదిలో మిగులు జలాల లభ్యత విషయంలో తెలంగాణలో ప్రతిపాదిత సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉత్తర భారత పార్టీగా మారిపోయిందని, కేవలం ఉత్తర భారత రాష్ట్రాలు పాలిస్తున్నాయని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కొత్త రాజ్యాంగం ఆవశ్యకతపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించి రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు అనేకసార్లు భారత రాజ్యాంగాన్ని సవరించాయని గుర్తు చేశారు. కేంద్రంలోని అధికార పార్టీలు తమ రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, తద్వారా రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని అన్ని రంగాల్లో ధ్వంసం చేస్తున్న బీజేపీ నేతలకు రాజ్యాంగం గురించి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు డాక్టర్ అంబేద్కర్ గాడ్ ఫాదర్ అని, బీజేపీ నాయకులు గాడ్సే వారసులని పేర్కొన్నారు.

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజ్యాంగం లక్ష్యాలు నెరవేరకపోవడంతో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచించగా, ప్రతిపక్షాలు మాత్రం రాత్రికి రాత్రే రాజ్యాంగాన్ని మార్చినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయడం కంటే ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu