
హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం KCR వ్యాఖ్యలను నిరసిస్తూ New Delhi లోని తెలంగాణ భవన్ ఆవరణలోని Ambedkarవిగ్రహం వద్ద BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay గురువారం నాడు మౌన దీక్షకు దిగాడు. ఈ దీక్షకు ‘బీజేపీ బీమ్ దీక్ష’ అని పేరు పెట్టింది.
ఈ నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ కేంద్రంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఇవాళ బీమ్ దీక్షను చేపట్టింది.
ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. దీక్షను ప్రారంభించడానికి ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై కేసీఆర్ ప్రజలకు క్షమానణ చెప్పాలని ఆయన కోరారు. అహంకారపూరితంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయని సంజయ్ విమర్శించారు. ఈ తప్పుడు వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఇంకా సమర్ధించుకోవడంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ను సీఎంగా ఎలా ఎన్నుకొన్నారని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
రాజ్యాంగం కల్పించిన అవకాశం ద్వారానే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్టుగా మోడీ చేసిన ప్రకటనను బండి సంజయ్ గుర్తు చేశారు. సామాన్యుడిగా ఉన్న తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి రాజ్యాంగమే కారణమని మోడీ ప్రకటనను ఆయన బండి సంజయ్ ప్రస్తావించారు.
టీఆర్ఎస్ నేతలు కూడా బలుపెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నరన్నారు. కేసీఆర్ కు సీఎం పదవి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షేనని చెప్పారు. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు.ఆ రాజ్యాంగం ప్రకారం సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్లొద్దనుకొంటున్నారన్నారు. గడీలు నిర్మించుకొని రారాజును తానే అని కేసీఆర్ భావిస్తున్నడని బండి సంజయ్ చెప్పారు.
అంబేద్కర్ రాజ్యాంగం వద్దు కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని కేసీఆర్ చెబుతున్నడన్నారు.తానే దోచుకోవాలని,తన అవినీతిని, కుటుంబ పాలనను ఎవరూ ప్రశ్నించొద్దని కేసీఆర్ కోరుకొంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. హామీలను నెరవేర్చకూడదు... నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వను...దళితులకు మూడెకరాలు ఇవ్వనంలున్నారని కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు. అంబేద్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని సంజయ్ చెప్పారు. కేసీఆర్... నీ నియంత పాలనను భరించాలా? అని ఆయన ప్రశ్నించారు. విశ్వాసఘాతకుడు... దేశ ద్రోహి అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను భరించడానికి సిద్ధంగా లేరు.