
కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman కు ట్విట్టర్ వేదికగా MLC Kavitha ప్రశ్న సంధించారు. సీఎం KCR ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిలదీశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? అని ప్రశ్నించారు. అంతేకాదు.. దేశం కోసమా? అయితే దేశం అంటే మట్టి మాత్రమే కాదు కదా... అంటూ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటి అంటూ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ దారుణమైన బడ్డెట్ ప్రవేశ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని చదివి వినిపించారనీ. కానీ అందులో ప్రసావించినవి.. ఆ ధర్మమని, ఆసత్యమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికీ లాభం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం తరహాలో ఉందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ జనాభా చాలా పెరిగింది కానీ, వారి జనాభా విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెపుతుందని మండిపడ్డారు. రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర బడ్జెట్‌లో పెట్టిన నిధుల కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులతో వారి సంక్షేమం కోసం పాటు పడుతోందని ఆయన అన్నారు.
రైతులకు మేలు చేయకుండా ఎరువులు, యూరియా మీద సబ్సిడీ తగ్గించారని, రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాలనీ, బడ్జెట్ రైతుల ప్రస్తవన లేకపోవడం భాదకరమని కేసీఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకానికి 25 కోట్ల కోత పెట్టడం బాధకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ ఇది అని.. ఇప్పటికి ప్రజలకు వీరి నిజస్వరూపం అర్థమైందని అన్నారు.
బీజేపీ పాలన అంటే.. దేశాన్ని అమ్మడం. మత పిచ్చి లేపడం. మంది మీద పడి ఏడవడం, ఆస్తుల అమ్మడమని.. బీజేపీదీ గోల్ మాల్ గోవిందం పాలసీ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గుజరాత్ మోడల్ అంటే.. పైనా పటారం.. లోన లోటారమని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో గోల్ మాల్ తప్ప వచ్చింది ఏం లేదనీ, కేంద్రానికి లేదనీ, మెదడు లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అత్యంత చెత్త పవర్ పాలసీ పాటిస్తుందనీ కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందిపడ్డ పరిస్థితులు చూసిన తరువాత కూడా ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపరచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అన్నారు. ఆహార సబ్సిడీకి నిధులు తగ్గించారని విమర్శించారు.
ఇక, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా బుధవారం కేంద్ర బడ్జెట్ మీద విరుచుకుపడ్డారు. Telangana ఈ దేశంలో లేదనే విధంగా.. పేదలకు పనికొచ్చేది ఒక్కటి లేని విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.