జర్నలిస్టులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ 2/3 తగ్గింపు

By telugu teamFirst Published Nov 12, 2021, 2:33 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి సరైన బస్ పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసి కూడా తమకు లభించాల్సిన కన్సెషన్ పొందవచ్చని సజ్జనార్ వెల్లడించారు. న్యూస్ ఫ్రెండ్స్‌కు గుడ్ న్యూస్ అంటూ ఈ మేరకు ట్వీట్ చేసి వివరించారు.
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ VC Sajjanar జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. Journalists తమ TSRTC బస్ పాసుతో Onlineలోనూ Ticketపై కన్సెషన్ పొందడానికి అవకాశం కల్పించారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో జర్నలిస్టు 2/3 తగ్గింపునకు(Concession) అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఈ సూచనలు చేసినవారికీ థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది జర్నలిస్టులు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. ఫొటో జర్నలిస్టుల తరఫున కేఎన్ హరి.. ఇంకా పలువురు పాత్రికేయులు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్టర్‌లో రిప్లై ఇచ్చారు.

Also Read: పెళ్లి జంటలకు సజ్జనార్ గుడ్ న్యూస్.. అలా చేస్తే ఆర్టీసీ నుంచి కానుకలు..

మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ బస్ పాస్ తీసుకుంటారు. వాటితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మినహాయింపును పొందుతుంటారు. నేరుగా కండక్టర్‌కు చూపించి ఇన్నాళ్లు జర్నలిస్టులకు లభించే కన్సెషన్ పొందేవారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేస్తే ఈ అవకాశాన్ని కోల్పోయేవారు. తాజాగా, టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడూ జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందేలా మార్పులు చేశారు. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. గుడ్ న్యూస్ ఫర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.

Good NEWS for our NEWS friends! Now, with valid bus pass from can avail of concession online also while booking tickets through our website. Thank You & for your suggestion
Patronage & pic.twitter.com/7FEyzzBN99

— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice)

ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే టికెట్ ధరపై రౌండ్ ఆఫ్ పేరుతో అదనపు వసూళ్లకు స్వస్తి పలికారు. అదనంగా కాదు.. అవసరమైతే వాస్తవ ధర కంటే తక్కువగానే రౌండ్ ఆఫ్ చేయాలని నిర్దేశించారు. అంటే.. టికెట్ ధర 16 ఉంటే.. రౌండ్ ఆఫ్‌గా రూ. 20 చేయడానికి బదులు.. రూ. 15 తీసుకోవాలని సూచనలు చేసినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుందనే భయాలు ఉన్నప్పటికీ సంస్థ ప్రతిష్టను మరింత మెరుగు పరిచి తర్వాత లాభాలను మళ్లీ పెంచుకోవచ్చనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, న్యాయపోరాటమే.. ఆర్టీసీఎండీ సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. తనదైన మార్క్‌ను కనబరుస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ట్విట్టర్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తున్నారు.  

దీంట్లో భాగంగానే అక్టోబర్ 25న హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సింప్లిసిటీ చాటుకున్నారు. 

click me!