ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ పై టిఆర్ఎస్ దాడి

Published : Sep 25, 2017, 12:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ పై టిఆర్ఎస్ దాడి

సారాంశం

కమిషనర్ ఇంటి మీదకు పోయి దాడి చేసిన టిఆర్ఎస్ కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి కమిషనర్ కమిషనర్ మీద కూడా ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ నేతలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంట్లోకి వెళ్లి టిఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు దాడి చేశారు. గత కాంతకాలంగా ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ కు, టిఆర్ఎస్ నాయకులకు మధ్య పొసగడంలేదు. దీంతో ఏకంగా కమిషనర్ ఇంటికి  వెళ్లి టిఆర్ఎస్ కౌన్సిలర్లు దాడికి పాల్పడడం చర్చనీయాంశమైంది.

తమ ఇంటికి వచ్చి తమ కుటుంబంపై దాడి చేసిన టిఆర్ఎస్ కౌన్సిలర్లపై కమిషనర్ రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఏదైనా సమస్యలపై చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నంచారు.

మరోవైపు  సిఎం, డిప్యూటీ సిఎంలను కమిషనర్ దూషించినట్లు టిఆర్ఎస్ కౌన్సలర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు కూడా కమిషనర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో కమిషనర్ తో టిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ నడిచినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు ఫ్లెక్సీల ఏర్పాటు తగదని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు సహించలేక దాడి చేసినట్లు చెబుతున్నారు. కమిషనర్ ఇంటి మీదకు పోయి కొట్టడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన చెందారు. తన భార్య, కొడుకు ముందే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే గతంలో సిఎం కేసిఆర్ ఫొటో నేల మీద పెట్టి రివ్యూ మీటింగ్ లు నడిపిన ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. రోజుల తరబడి సిఎం కేసిఆర్ ఫొటో గోడకు తగిలించాల్సిందిపోయి నేల మీదే ఉంచినట్లు ఆరోపణలున్నాయి.

గతంలో సిఎం కేసిఆర్ ఫొటో కింద పెట్టి సమీక్ష సమావేశాలు జరిపిన కమిషనర్. దాని తాలూకు ఏషియా నెట్ రాసిన కథనం... కింద చూడొచ్చు.

 

 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?