ఇల్లెందు మున్సిపల్ ఆఫీసు సిబ్బంది నిర్వాకం రోజుల తరబడి నేలమీదే కెసిఆర్ చిత్రపటం కెసిఆర్ ఫొటో కింద పడేసి పక్కనే ఉన్నత స్థాయి సమావేశం అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం
తెలంగాణ వచ్చిన తర్వాత తొలి రెండున్నరేళ్ల పాటు అన్ని జిల్లాల్లో సిఎం కెసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగాయి. సిఎం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, టిఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉండే ప్రజా సంఘాల వారు రంగంలోకి దిగి పాలాభిషేకాలు జరిపి హల్ చల్ చేశారు. కానీ ఇప్పుడు ఇల్లెందు మున్సిపల్ ఆఫీసులో సిఎం ఫొటో కింద పడేశారు. ఈ అంశం ఇప్పుడు వివాదస్పమవుతోంది.

కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో సిఎం కెసిఆర్ పొటో కింద పడేశారు. చాలా రోజులుగా ఆ ఫొటో అలా కిందనే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది ఇల్లెందుకు మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఇలా నేల మీద సిఎం ఫొటో పడేయడాన్ని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్. ఈ సమావేశంలో డిఎస్పీ, సింగరేణి జిఎం, సిడిపిఓ, ఎంఇఓ, వైద్యాధికారి, స్వచ్ఛంద సంస్థల ఎన్జిఓలలు పాల్గొన్నారు. సమావేశం సమయంలోనైనా కనీసం సిఎం ఫొటో పైన గోడకు తగిలిస్తే బాగుండేది కదా అని అంటున్నారు. ఆ సమావేశంలో కూడా సిఎం ఫొటో కింద పడే ఉండడంతో కొందరు ఎన్టీఓ లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
