
దళితులకు భూపంపిణీలో ఎమ్యెల్యే రసమయి, తెరాస నేతల అవినీతి కారణంగానే శ్రీనివాస్ మరణించాడని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందువల్ల ఈ హత్యకు రసమయియే పరోక్షంగా బాధ్యడుని ఆయన అన్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దళిత యువకుల నుంచి మరణ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయకపోవడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు.
దళిత యువకుడు శ్రీనివాస్ మరణానికి బాధ్యులైన తెరాస నేతలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీనివాస్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధిక సాయంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం, డబల్ బెదురూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు
శ్రీనివాస్ మరణ వార్త ఇక్కడ చదవండి