తెలంగాణ డిఎస్ సి మీద జబర్ద స్త్ పాట

Published : Sep 24, 2017, 02:15 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
తెలంగాణ డిఎస్ సి మీద జబర్ద స్త్ పాట

సారాంశం

లక్షలాది మంది నిరుద్యో గులు  టీచర్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. మూడున్నరేళ్ల యినా ప్రభతుత్వం మాత్రం ‘తొందర్లోనే నోటిఫికేషన్,’ అంటున్నది. ఎదురుచూసే ఓపిక నశిస్తూ ఉంది. అందుకే ఈ పాట ఎత్తుకున్నారు...

డిఎస్సీ డిఎస్సీ ఉయ్యాలో  త్వరలో  డిఎస్సీ ఉయ్యాలో

కడియం సారు చెప్పాడుఉయ్యాలో   

ఇంకా   త్వరలోనే ఉయ్యాలా!!

ఐదేండ్లు  ఐపాయే   ఉయ్యాలో   ఇంకా  త్వరలోనే   ఉయ్యాలా!!

పెండ్లిళ్ళు లేవాయాఉయ్యాలో    పైసలు   లేవాయె   ఉయ్యాల !!  

అప్పులు  జేస్తిమి   ఉయ్యాలో     కష్టాలపాలెైతిమి    ఉయ్యాల!!   

తిరిగి  తిరిగి   ఉయ్యాలో       కోచింగోడు  బలిసె  ఉయ్యాల!!    

దయలేని  మారాజు  ఉయ్యలో  మన  కెసిఆర్  సార్  ఉయ్యాల !!  

రోజొక్క     పేపర్ల   ఉయ్యాలో   త్వరలో   డిఎస్సీ  ఉయ్యాలా!!    

గుండాగిపోవట్టే    ఉయ్యాలో     ఊపిరే  పోవట్టే   ఉయ్యాలా!!   

కడుపుకోతలలేమిగిలేఉయ్యాలో 

 మముగన్న    తల్లులకు    ఉయ్యాలా !!                 

ఇరవైవేలపోస్టులు   ఉయ్యాలో   తొమ్మిదివేలకొచ్చే  ఉయ్యాలా!!  

ఆంధ్రాలో   రెండో   డిఎస్సీ ఉయ్యాలో          మనక్కొక్కటీగతిలేదు ఉయ్యాలా!!             

మాటలాప్రభుత్వం  ఉయ్యాలో      చేతలేమిలేవు    ఉయ్యాలా!! 

ఇకనైనా  మారాలి  ఉయ్యాలో  కెసిఆర్  పాలనా   ఉయ్యాలా!!

దసరా  పండక్కి   డిఎస్సీ ఏసి ఉయ్యాలో        మాకడుపుకోతలాపు  ఉయ్యాలా!!                     

డిఎస్సీ డిఎస్సీ ఉయ్యాలో     త్వరలో    డిఎస్సీ  ఉయ్యాలా

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu