Huzurnagar Election Result: 20 ఏళ్ల ఉత్తమ్ కోట బద్దలు, ఒక్కసారి చూద్దామని సైదిరెడ్డికి...

By narsimha lodeFirst Published Oct 24, 2019, 2:03 PM IST
Highlights

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలైంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి విజయం సాధించాడు. సానుభూతితో పాటు టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకోవాలనే వ్యూహాంతో ముందుకు సాగడం కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉణ్నారు. 

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కంటే ఒక్కసారి సైదిరెడ్డికి అవకాశం కల్పించినట్టుగా రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయంతో ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల నుండి  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు.

 video : గెలుపు సంబరాల్లో వరంగల్ టీఆర్ ఎస్ నేతలు

ఈ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేసింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి రెండోసారి పోటీ చేశారు. 2018 డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేతిలో సైదిరెడ్డి ఓటమి పాలయ్యాడు.

ఈ ఉప ఎన్నికల్లో  సైదిరెడ్డిని  టీఆర్ఎస్  అభ్యర్ధిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి బరిలోకి దింపింది. అయితే గత ఎన్నికల సమయంలో సైదిరెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గంలోనే ఉన్నాడు.

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రతి గ్రామాన్ని  రెండు మూడు దఫాలు పర్యటించారు. సుమారు 20 ఏళ్లుగా ( గతంలో కోదాద అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత ప్రాంతం ప్రస్తుతం హుజూర్‌నగర్ ప్రాంతంలో కొంత ఉండేది) ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

read more #Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడం ద్వారా హుజూర్‌నగర్  ప్రాంతాన్ని  అభివృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయంతో ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలపై స్థానిక ఓటర్లలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ప్రభావం ఓటింగ్‌పై చూపలేదు. ఈ స్థానంలో టీఆర్ఎస్‌ అభ్యర్ధిని ఓడించడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండి ఉండకపోవచ్చనే అభిప్రాయంతో ఓటర్లు టీఆర్ఎస్‌ వైపుకు మొగ్గు చూపారు.మరోవైపు సైదిరెడ్డిపై సానుభూతి కూడ టీఆర్ఎస్ కు కలిసివచ్చిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

  read more Huzurnagar Result: పద్మావతిపై కోదాడ కేసు ఎఫెక్ట్, అదేమిటి....

హుజూర్ నగర్లో మాత్రం గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి. ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. 

click me!