పదవి రాగానే మామ పక్షాన చేరావా..? హరీష్ రావుపై మందకృష్ణ కామెంట్స్

By telugu teamFirst Published Oct 24, 2019, 1:00 PM IST
Highlights

20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హరీష్‌రావుకు పదవి రాకపోతే తెలంగాణ అశేష ప్రజానీకం మొత్తం ఆయన వెన్నంటి నిలిచిందని.. కానీ పదవి వచ్చిన తర్వాత హరీష్ రావు అవన్నీ మర్చిపోయారని మందకృష్ణ పేర్కొన్నారు.

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ప్రతి విషయంపై స్పందించే హరీష్ రావు... ఆర్టీసీ సమ్మెపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజులుగా సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమింప చేయమని వారు చెబుతున్నారు. కాగా.. కార్మికులు సమ్మె చేపట్టి ఇన్ని రోజులు అవుతున్నా... దీనిపై మంత్రి హరీష్ రావు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. దీంతో.... మందకృష్ణ మాదిగ ఈ విషయంపై ఈరోజు మీడియాతో మాట్లాడారు.

20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హరీష్‌రావుకు పదవి రాకపోతే తెలంగాణ అశేష ప్రజానీకం మొత్తం ఆయన వెన్నంటి నిలిచిందని.. కానీ పదవి వచ్చిన తర్వాత హరీష్ రావు అవన్నీ మర్చిపోయారని మందకృష్ణ పేర్కొన్నారు. హరీష్‌రావు కార్మికవర్గం పక్షమా, మామ పక్షమో తేల్చుకోవాలన్నారు.
 
అన్నింటికీ స్పందించే హరీష్‌రావుకు కార్మికవర్గం ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు హరీష్‌రావు ప్రజల మనిషి అని నమ్మకం పెట్టుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నమ్మకద్రోహం చేస్తాడో.. పదవుల వ్యామోహంలో ఉంటాడో తేల్చుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అన్ని విపక్షాలను కలుపుకొని సంఘటితం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని.. ఆర్టీసీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మందకృష్ణ తెలిపారు.

click me!