
సంక్రాంత్రి పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. మాంజా దారం మెడకు చుట్టుకోవడంతో ఓ ఆర్మీ జవాను మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన కోటేశ్వర రెడ్డి కొన్నేళ్లుగా ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు.
మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి - భారత్ కు మాల్దీవుల అల్టీమేటం..
ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే తన విధులను పూర్తి చేసుకొని తరువాత బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఆయన లంగర్ హౌస్ ప్రాంతానికి చేరుకునే సరికి గాలిపటాలు ఎగురవేసే మాంజా దారం కోటేశ్వర రెడ్డి మెడకు చుట్టుకుంది. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
స్థానికులు ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లో ఆయన మరణించారు. గాలి పటాలు ఎగుర వేసేందుకు మాంజా దారం ఉపయోగించకూడదని ప్రభుత్వం ఎన్ని సూచనలు చేసినా.. దానిని పెడచెవిన పెట్టడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. నిబంధనలను ఉల్లంఘిస్తూ పలువురు విక్రయిస్తున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..
కాగా.. పండగ పూట పతంగులు ఎగురవేస్తున్న క్రమంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో పలువురు మరణించారు. హైదరాబాద్ లోని నాగోల్ లో ఎనిమిదో తరగతికి చెందిన బాలిక, అత్తాపూర్ లో ఓ బాలుడు బిల్డింగ్ పై గాలిపటాలు ఎగురవేస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిద్దరూ మరణించారు. అలాగే అల్వాలర్ లో కూడా ఓ యువకుడు బిల్డింగ్ పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు.