ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదు - మంత్రి పొన్నం ప్రభాకర్

By Sairam Indur  |  First Published Jan 14, 2024, 5:21 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress government) ఎవరూ కూలగొట్టలేరని, బీఆర్ఎస్ (BRS)కు అంత ధైర్యం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Pabhakar) అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. 


Ponnam Pabhakar : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన కామెంట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కరీంనగర్ లో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటే ఎవ్వరూ నమ్మలేదని అన్నారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాటలు ఆ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పడానికి నిదర్శనంగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్ కి లేదని అన్నారు. 

ఫామ్ హౌస్ కు అవి కావాలని ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్.. షాప్ యజమాని షాక్..

Latest Videos

undefined

తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఎవరూ ఊరుకోబోరని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయబోని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి‌సంజయ్ నంబర్ వన్ గా ఉన్నారన విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఐదేళ్లు కూడా కరీంనగర్ కు ఎంపీగా పని చేశారని, మరో ఐదేళ్లు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పని చేశారని గుర్తు చేశారు. ఆయన హాయంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

జలమండలి జీఎంకు మూడేళ్ల జైలుశిక్ష.. ఏసీబీ కోర్టు సంచలన తీర్పు..

బండి‌ సంజయ్ మాటలు వింటుంటే జ్యోతిషం చెప్పినట్లుగా ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు. జీవితంలో ఎప్పుడూ కూడా బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయబోవని అన్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ అసహనంతో ఉన్నారని అన్నారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ పవర్ ఫుల్ పదం అనేది ఒట్టి భ్రమ అని అన్నారు. కేసీఆర్ అనే పదానికి అవసరమైతే పూజ చేసుకోవాలని సూచించారు. సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అన్నారని, కానీ సీఎం అనే రెండక్షరాలు అనే పదం కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం శక్తివంతమైనదని కొడుకు అంటున్నారని విమర్శించారు. 

PM Modi AP Tour: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశ భవిష్యత్తు ని నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారని అన్నారు. జగథ్గురువులు చెప్పిన గానీ అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల స్టంటే అని అన్నారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవ్వరూ చేయాలో తెలియదా అని ప్రశ్నించారు. ఇది అరిష్టం కాదా అని తెలిపారు.

click me!