ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..

Published : Jan 14, 2024, 06:17 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..

సారాంశం

బీజేపీ (BJP)నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ (goshamahal mla t rajasingh) హత్య బెదిరింపు కాల్స్ (Death threat calls) వచ్చాయి. రెండు నెంబర్ల నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రామ నవమి (Rama navami) రోజు శోభాయాత్ర చేస్తే చంపేస్తానంటూ హెచ్చరించాడు.

బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో సారి హత్యా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వచ్చే రామనవమి రోజు శోభాయత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయనను హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఎమ్మెల్యే రాజాసింగ్ ధీటుగా సమాధానాలు ఇచ్చారు. దమ్ముంటే నేరుగా రావాలని, ఫోన్ లో బెదిరించకూడదని సవాల్ విసిరారు.

ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదు - మంత్రి పొన్నం ప్రభాకర్

రాజాసింగ్ కు 7199942827, 4223532270  అనే రెండు నెంబర్ల నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. కాగా.. గోషామహల్ ఎమ్మెల్యేకు ఇలా బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయనకు ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి. అయితే అయోధ్య రామాలయ ప్రారంభం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్న తరుణంలో ఈ బెదిరింపు కాల్స్ రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. 

ఫామ్ హౌస్ కు అవి కావాలని ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్.. షాప్ యజమాని షాక్..

ఈ బెదిరింపుల విషయంలో ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. తనను హత్య చేస్తామంటూ కాల్స్ వస్తున్నాయని అందులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ లేఖలో ఇంత వరకు తనను బెదిరింపులకు గురి చేస్తూ వచ్చిన కాల్స్, ఫోన్ నెంబర్ల లిస్ట్ లను జత చేశారు. పాకిస్థాన్ నుంచి కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని గతంలో ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా దూసుకొచ్చిన లారీ.. యువతి మృతి..

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే టి.రాజాసింగ్ ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి మూడో సారి గెలిచారు. 2014 మొదటిసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో 45.18 శాతం ఓట్లు సాధించి 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి గతం కంటే ఇంకా ఎక్కువే మెజారిటీ సాధించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?