
హైదరాబాద్: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్.... ట్రబుల్స్ లో పడ్డారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy చెప్పారు. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం నాడు జగ్గారెడ్డి హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.ఈ ఎన్నికల్లో 230 ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా కూడా రాజీనామా చేస్తానని శపథం చేశానని ఈ శపథంతో తమ పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేశారని జగ్గారెడ్డి చెప్పారు. తమ పార్టీ బరిలో ఉన్నందున టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మంత్రి Harish Rao క్యాంప్ పెట్టారని జగ్గారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ క్యాంప్ పెట్టకపోతే తమ సత్తాను చూపేవాళ్లమని ఆయన చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆట మొదలైందన్నారు. 2023 ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట స్థానాలను కూడా కైవసం చేసుకొంటామని జగ్గారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
also read:ఖమ్మం, మెదక్‌లలో పలించిన వ్యూహాం: నల్గొండలో చతికిలపడిన కాంగ్రెస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య నిర్మలను బరిలోకి దింపాడు జగ్గారెడ్డి. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. సుమారు వెయ్యికి పైగా ఓట్లున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 230 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే తమ పార్టీకి ఉన్న ఓట్లు తమ పార్టీ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి పడకపోతే తాను రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి యాదవ్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. Congress పార్టీకి ఉన్న 230 ఓట్ల కంటే అదనంగా ఎనిమిది ఓట్లు ఆ పార్టీకి దక్కాయి.ఈ జిల్లాలో Bjpకి సుమారు 50కిపైగా ఓట్లున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు Trs పార్టీవా, లేక బీజేపీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రరెడ్డి, శంభీపూర్ రాజు, నిజామాబాద్ నుండి కవిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపును ఇవాళ నిర్వహించారు.