Revanth Reddy: రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ దూకుడు పెంచింది. అధికార పార్టీతో పాటు బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తూ.. ప్రజా సమస్యలులేవనెత్తుతూ ప్రజల్లోకి వెళ్తున్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. తెలంగాణలో రైతుల మరణ మృదంగం మోగుతున్నదనీ, సమస్యలు పరిష్కరించాల్సిన సీఎం తీర్థయాత్రలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Revanth Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు కారణంగా దేశంలో అన్నదాతల పరిస్థితులు రోజురోజుకూ దారుణంగానే మారుతున్నాయి. ప్రభుత్వాలు వారికోసం అన్ని చేస్తున్నామంటూ ఉత్తిమాటలతో కాలం గడుపుతున్నాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పండించిన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వాలు చొరవ చూపాలని రైతన్నలు కొన్నేండ్లుగా కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితులు దుర్బలంగా మారుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రైతుల పరిస్థితులపై మంగళవారం నాడు స్పందిస్తూ.. అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు రాష్ట్ర సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్థయాత్రల్లో బిజీగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన.. రుణమాఫీ లేకపోవడం.. పంటను కొనుగోలు చేసే నాథుడు లేక అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని Revanth Reddy ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం ఎంతో కష్టపడి పండింఇన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అన్నారు.
Also Read: MLC Elections | అధికార పార్టీ టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ కలవరం !
"తెలంగాణ లో అన్నదాతల మరణమృదంగం మోగుతోంది. రుణమాఫీ లేదు, పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు,రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దానికి #ByeByeKCR అనే ట్యాగ్ పెట్టారు. అలాగే, రైతుల మరణాలకు సంబంధించి పలు వార్తా పత్రికల్లో రైతు ఆత్మహత్యల కథనాల పెపర్ కట్టింగ్స్ ను జత చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో వరి ధాన్యం పిండిస్తున్న అన్నదాతలతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు పంటకు కనీస మద్దతు ధర లభించక ఇబ్బందులు పెడుతున్నారు. సాగు ఖర్చులు అధికమవుతుండటం, ఎరువులు, విత్తనాల ధరలు సైతం పెరుగుతుండటంతో పంట సాగు ఖర్చు భారీగా పెరిగిపోతున్నది. అయితే, ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించక పోగా.. ధాన్యం సేకరణలోనూ జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం.. రాజకీయ పార్టీలు వాస్తవాలు వివరించకుండా.. సాగుపైనా రాజకీయాలు చేస్తుండటంతో అన్నదాతలు గందరగోళానికి గురవుతున్నారు.
Also Read: Madhusudhana Chary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
ఆర్థిక ఇబ్బందులు, రుణభారాలు మరింత పెరుగుతుండటంతో ప్రాణాలు తీసుకుంటున్న రైతులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రైతు బలవన్మరణాలు పెరుగుతుండం రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. మిరప సాగు చేసి నష్టాల ఊబిలో చిక్కుకున్నాననీ, అప్పుల బాదలు పెరిగాయని పేర్కొంటూ ములుగు జిల్లాలో ఓ రైతు ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లాలోనూ మరో రైతు ఇదే తరహా కారణాలతో ప్రాణాలు తీసుకున్నారు. ఇక మెదక్ జిల్లా రైతు ఓ లేఖ రాసిమరి ప్రాణాలు తీసుకోవడం.. లేఖలో ప్రస్తావించిన అంశాలు అందరినీ కన్నీరు పెట్టించాయి. ఆ లేఖలో ప్రస్తావించిన వివరాలు ఇలావున్నాయి.. సర్కారు చెప్పినట్లు సన్నరకం ధాన్యం పండిస్తే దిగుబడి తక్కువొచ్చింది. పండిన పంటకు కనీస మద్దతు ధర లభించలేదు. ఇప్పుడు వరి వేయవద్దని చెబుతున్నారు. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏండ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. అతణ్ని ఇంజినీరింగ్ చదివియ్యాలె.'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి ఆ రైతు తన ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: coronavirus | దేశంలో భారీగా తగ్గిన కోవిడ్-19 కేసులు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నంటే?
తెలంగాణ లో అన్నదాతల మరణమృదంగం మోగుతోంది.
రుణమాఫీ లేదు,పంటను కొనే నాథుడు లేడు,అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి.
ఇంటి ముందు అప్పులోడి లొల్లి.
సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు,రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు. pic.twitter.com/eUc9av8csB