జగ్గారెడ్డి క్రమ శిక్షణను ఉల్లంఘించారు: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Dec 31, 2021, 4:23 PM IST


 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి క్రమ శిక్షణను ఉల్లంఘించారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి చెప్పారు. క్రమ శిక్షణ కమిటీ ముందుకు జగ్గారెడ్డిని పిలుస్తామని ఆయన తెలిపారు.


హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddyక్రమశిక్షణ ఉల్లంఘించారని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తామని ఆయన చెప్పారు.

టీపీసీసీ చీఫ్ Revanth Reddyని తప్పించాలని గత వారంలో ఎఐసీసీ చీఫ్ Sonia gandhiకి  జగ్గారెడ్డి  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాశాడు. ఈ లేఖ ప్రతి మీడియాకు విడుదల కావడంపై చిన్నారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీ భవన్ లో చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి పై చర్యలు తీసుకోవడం తమ పరిధిలోకి రాదన్నారు.జంగా రాఘవరెడ్డితో మరోసారి మాట్లాడుతామని చిన్నారెడ్డి చెప్పారు. మంచిర్యాలలో వీహెచ్ పై ప్రేమ్ సాగర్ అనుచరుల దాడిపై  కూడా తమ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. 

Latest Videos

undefined

అసలు ఏం జరిగిందంటే?

ఈ ఏడాది డిసెంబర్ 27న ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించలేదు.  మరో వైపు ఈ రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై కూడా జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో రచ్చబండి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు రేవంత్ రెడ్డిని హైద్రాబాద్ లోనే అరెస్ట్ చేశారు. అయితే అదే రోజున సాయంత్రం సోనియా గాంధీకి జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకత్వం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినందున అందరం కలుపుకుని పోతున్నామన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.  వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నాడని ఆయన మండిపడ్డారు. పార్టీ డైరెక్షన్ లో కాకుండా వ్యక్తిగత ఇమేజే కోసమే రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నాడని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి ఆరోపించారు.

also read:వరంగల్ రచ్చబండ: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు, పోలీసులపై ఆగ్రహం

 రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధిని బరిలోకి దింపలేని విషయాన్ని ఆ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవన్నారు.పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖను రాస్తున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి స్టార్ లీడర్ గా ఎదగాలని అనుకొంటున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై  కొందరు సీనియర్లు  తీరును తప్పుబడుతున్నారు. అవకాశం దొరికిన సమయంలో ఈ విషయమై పార్టీ అధిష్టారానికి ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహర శైలిపై అవకాశం వచ్చినప్పుడల్లా  జగ్గారెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ వేదికలతో పాటు మీడియా వేదికగా చేసుకొని కూడా జగ్గారెడ్డి విమర్శలు చేస్తున్నారు. సోనియాగాంధీకి లేఖ రాయడాన్ని చిన్నారెడ్డి తప్పు బట్టలేదు. కానీ అంతర్గత విషయాలపై జగ్గారెడ్డి రాసిన లేఖ బయటకు రావడాన్నే ఆయన తప్పుబట్టారు.

click me!