
ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు న్యూ ఇయర్ వేళ మరో భారీ షాక్ తగిలింది. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ (vijaya dairy) పాల ధరలను (milk Price) పెంచింది. లీటర్ టోన్డ్ మిల్క్‌పై రూ. 2, లీటర్ హోల్ మిల్క్‌పైన రూ. 4, లీటర్ డబుల్ టోన్డ్ మిల్క్‌పైన రూ. 2, లీటర్ ఆవు పాలపై రూ. 2 పెంచినట్టుగా తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. పెంచిన ధరలు రేపటి నుంచి (జవనరి 1) అమల్లో రానున్నట్టుగా సంస్థ వెల్లడించింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరిగిన దృష్ట్యా ధరలను పెంచుతున్నట్టుగా సంస్థ పేర్కొంది. వినియోగదారులు సహకరించాలని సంస్థ కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ధరల్లో మార్పులు..
-డబుల్ టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 200 ml).. ప్రస్తుత ధర రూ. 9.00, పెరిగిన ధర రూ. 9.50
-డబుల్ టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 300 ml).. ప్రస్తుత ధర రూ. 14.00, పెరిగిన ధర రూ. 15.00
-డబుల్ టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 22.00, పెరిగిన ధర రూ. 23.00
-ఆవు పాలు (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 24.00, పెరిగిన ధర రూ. 25.00
-టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 200 ml).. ప్రస్తుత ధర రూ. 10.00, పెరిగిన ధర రూ. 10.50
-టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 24.00, పెరిగిన ధర రూ. 25.00
-టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 1000 ml).. ప్రస్తుత ధర రూ. 47.00, పెరిగిన ధర రూ. 49.00
-టోన్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 6 L).. ప్రస్తుత ధర రూ. 276.00, పెరిగిన ధర రూ. 288.00
-స్టాండైజ్డ్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 26.00, పెరిగిన ధర రూ. 27.00
-హోల్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 31.00, పెరిగిన ధర రూ. 33.00
-డైట్ మిల్క్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 21.00, పెరిగిన ధర రూ. 22.00
- టీ స్పెషల్ (ప్యాకెట్ సైజ్- 500 ml).. ప్రస్తుత ధర రూ. 23.00, పెరిగిన ధర రూ. 24.00