తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు మీకున్న అభ్యంతరాలు ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది.ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు లేఖ రాశారు.
హైదరాబాద్: Telangana ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతిపై CBI విచారణకు మీకున్న అభ్యంతరాలు ఏమిటని ప్రధాని Narendra Modi ని టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు Letter రాశారు. ఏ చీకటి ఒప్పందం ఈ విచారణను ఆపుతుందని రేవంత్ రెడ్డి అడిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు విఫలం చెందాయని ఆయన విమర్శించారు. ఎనిమిదేళ్లుగా BJP, TRS మధ్య ఫెవికాల్ బంధం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. IITR పై నోరు ఎందుకు మెదడపడం లేదో చెప్పాలన్నారు. విభజన హామీలు ఇంకా అమలు కానీ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
undefined
also read:PM Modi Hyderabad visit: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. కేసీఆర్‌పై బీజేపీ ఫైర్ !
Nizambad లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డు ఏమైందని ఆయన ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం పెంచుతామన్న మీరు తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ఆ లేఖలో మోడీని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.రామాయణం సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటేదని రేవంత్ రెడ్డి అడిగారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. . గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు మోడీకి స్వాగతం పలకనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2 గంటల సమయంలో ఐఎస్‌బీకు వెళ్తారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావడం కోసం బెంగుళూరుకు వెళ్లారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ కాన్వొకేషన్‌లో పాల్గొని సందేశమివ్వడంతోపాటు గ్రాడ్యుయేట్లకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు మోడీ.
ఈ కార్యక్రమంలో 35 నిమిషాలు ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హెచ్‌సీయూలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. 3.55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరుతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బీ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది.
ఐఎస్‌బీ పరిసరాల్లోని 5 కి.మీ. మేర బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. మరోవైపు గచ్చిబౌలి పరిసరాల్లో సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలుకుతారు. బీజేపీ క్యాడర్ తో మోడీ కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఉంది.