హైదరాబాద్ లోని ఉప్పల్ చౌరస్తాలో అక్రమంగా ఓ భారీ నిర్మాణం జరుగుతుంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని... కొంపదీసి ఈ భాగొతంలో మీరూ భాగస్వాములేనా? అంటూ కేటీఆర్ కు రేవంత్ ట్వీట్ చేసారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తనయుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని గతంలో అనేక అవినీతి ఆరోపణలు చేసారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత దూకుడు పెంచిన రేవంత్ KTR ను మాత్రం వదిలిపెట్టడంలేదు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ చౌరస్తాలో ఓ మంత్రి అండతో అక్రమంగా ఓ భారీ నిర్మాణం జరుగుతోందని... దీంట్లో మీరూ భాగస్వాములేనా అంటూ కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ revanth reddy ట్వీట్ చేసారు.
''హైదరాబాద్ మంత్రి అండతో ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేని అక్రమ నిర్మాణం వెలుస్తోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..? లేదా మీరూ భాగస్వాములేనా కేటీఆర్?'' అంటూ నిర్మాణానికి సంబంధించిన ఓ వీడియోను జతచేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. తెలంగాణ సీఎంఓ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా ఈ ట్వీట్ ట్యాగ్ చేశారు.
undefined
హైదరాబాద్ మంత్రి అండ…
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు… మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!? pic.twitter.com/zUoiZmQXbE
రేవంత్ ట్వీట్ తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) అధికారులు వెంటనే స్పందించారు. ఉప్పల్ సర్కిల్ అధికారులు అనుమతులు లేకుండా సెల్లార్ గుంతలో పిల్లర్లపై ఏర్పాటు చేస్తున్న సెంట్రింగ్ నిర్మాణాన్ని సోమవారం పూర్తిగా కూల్చివేశారు.
read more కేసీఆర్‌కి ఈసీ షాక్: హుజూరాబాద్‌లో దళితబంధుకి బ్రేక్
గతంలో కూడా మంత్రి కేటీఆర్ అధికార అండదండలతో జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ శివారులోని జన్వాడ ప్రాంతంలో ఫార్మ్ హౌస్ నిర్మించారని... ఉస్మాన్ సాగర్ లోకి వర్షపునీరు చేరే సహజసిద్ధమైన నాలాను ఆక్రమించి ఈ నిర్మాణం చేప్పట్టారని కేటీఆర్ ఆరోపించారు.
అయితే అక్రమంగా ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నట్లు తనపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టారు కేటీఆర్. తనకు ఆ ప్రాపర్టీ (ఫార్మ్ హౌజ్) కి ఎటువంటి సంబంధం లేదని, కాంగ్రెస్ నేత ఇలా ఎన్జీటీలో కేసును దాఖలు చేయడం ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిగత కక్షసాధింపు చర్య అని, తప్పుడు ఆరోపణలపై చట్టప్రకారంగా ముందుకు సాగుతానని తెలిపారు కేటీఆర్.
అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. కేటీఆర్ ఫార్మ్ హౌజ్ వద్ద తచ్చాడుతూ ఆయన విధులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించినందుకు గాను రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. నార్సింగి పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ మెమోలో... మార్చ్ 2వ తేదీ అర్ధరాత్రివేళ మియాఖాన్ గడ్డ ప్రాంతంలోని స్వరూప్ క్రికెట్ గ్రౌండ్ పరిసరాల్లో ఎవరో అనుమతులు లేకుండా డ్రోన్ ని ఎగురవేస్తున్నట్టు మొబైల్ లేక్ పోలీసులు గుర్తించారు. వెంటనే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు.
read more డీఎస్‌తో రేవంత్ రెడ్డి భేటీ: ఏం జరుగుతుంది?
పోలీసుల విచారణలో మంత్రి కేటీఆర్ తోసహా ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ఉన్న ప్రాంతంలో రేవంత్ రెడ్డి అనవసరంగా తచ్చాడుతున్నారని... వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించినందున నేర శిక్షాస్మృతి సక్షన్ 7 కింద శిక్షకు అర్హులని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 287, 115, 109, 201, 120(బి) కింద వీరిపై కేసులు నమోదుచేసినట్టు నార్సింగి పోలీసులు కోర్టుకి తెలిపారు.
ఇలా పోలీసులేమో కేటీఆర్ ఫార్మ్ హౌజ్ చుట్టూ వీరు తచ్చాడుతున్నందున అరెస్ట్ చేసాము అని అంటుంటే... కేటీఆర్ ఏమో ఆ ఫార్మ్ హౌజ్ తనది కాదు అని అంటున్నారు. ఇంతకు ఆ ఫార్మ్ హౌజ్ కేటీఆర్ ది కాకపోతే... పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసారా...? లేదా కేటీఆర్ ఆ ఫార్మ్ హౌస్ తనది కాదు అని అబద్ధమాడుతున్నారా అనేది తేలాల్సిన అంశం.