సైబర్ మోసగాడి వలలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. లింక్ ఓపెన్ చేసి..

By AN TeluguFirst Published Oct 19, 2021, 8:29 AM IST
Highlights

ఈ మధ్యనే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అయితే దాన్ని వాడే క్రమంలో.. కొన్ని ఇన్ పుట్స్ కోసం ఫోన్లోని నెట్ లో వెతికాడు.. ఈ నెల 16న బ్యాంకు ప్రతినిధిగా ఓ వ్యక్తి ఫోన్ లో పరిచయం చేసుకుని కార్డు నెంబర్ పనిచేయడం నిమిత్తం Link పంపుతున్నారని దాని తెరవాలని సూచించాడు.

సిద్దిపేట : సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ Software Engineerమోసపోయాడు. కొత్త Credit cardను వాడుకోవడానికి యత్నించే దశలో  ఖాతాలోని సొమ్మును మొత్తం పోగొట్టుకున్నాడు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రంగదాంపల్లి కి చెందిన కార్తీక్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వర్క ఫ్రం హోం కావడంతో ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నాడు.

ఈ మధ్యనే ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అయితే దాన్ని వాడే క్రమంలో.. కొన్ని ఇన్ పుట్స్ కోసం ఫోన్లోని నెట్ లో వెతికాడు.. ఈ నెల 16న బ్యాంకు ప్రతినిధిగా ఓ వ్యక్తి ఫోన్ లో పరిచయం చేసుకుని కార్డు నెంబర్ పనిచేయడం నిమిత్తం Link పంపుతున్నారని దాని తెరవాలని సూచించాడు.

కార్తీక్  లింకును తెరవగానే అతని  Accountలో ఉన్న రూ.49,995  డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.  దీంతో ఏం జరిగిందో అర్థం కాని కార్తీక్ సంబంధిత బ్యాంకు కి వెళ్లి విచారించగా  నగదు డెబిట్ అయినట్లు సిబ్బంది చెప్పారు. దీంతో తాను సైబర్ క్రైం ఉచ్చులో పడ్డట్టు కార్తీక్ రెడ్డి గుర్తించాడు. బ్యాంకు వారి సూచన తో సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

ఇదో రకం మోసం...
కాగా, ఇలాంటి మోసాలు కొత్తకాదు. ఫేస్ బుక్ వేదికగా, లింకులు పంపి ఓపెన్ చేస్తే.. డబ్బులు మాయం చేసే గ్యాంగ్ ఇటీవల పెచ్చుమీరి పోతున్నాయి. అలాంటి కొత్తరకం సైబర్ క్రైం ఘటన ఇది. ఫేస్ బుక్ వేదికగా అక్షరాలా రూ. 50 వేలు పోగొట్టుకున్న ఘటన కర్ణాటకలో గత డిసెంబర్ లో జరిగింది. కర్ణాటకలోని కనకపుర రోడ్డు యలచేనహళ్లి నివాసి సవితాశర్మా ఫేస్‌బుక్‌లో రూ.250 విలువ చేసే ఒక థాలి ఆర్డర్‌ చేస్తే రెండు థాలీలు ఉచితంగా ఇస్తామని ప్రకటన గమనించింది. 

భోజనం ఆర్డర్‌ చేయడానికి ప్రకటనలో ఇచ్చిన నెంబరుకు ఫోన్‌ ‌చేసింది. ఈ క్రమంలో ఆర్డర్‌ చేయడానికి ముందు రూ.10 చెల్లించాలని, అనంతరం భోజనం ఇంటికి సరఫరా చేసిన అనంతరం మిగిలిన నగదు చెల్లించవచ్చునని అవతలి వ్యక్తి తెలిపాడు. అంతేకాదు దీనికోసం ఓ ఫాం నింపాలని సవితాశర్మా మొబైల్‌కు లింక్‌ పంపించాడు.

ప్రియుడితో తిరగొద్దందని... తల్లి మెడకు చున్నీ చుట్టీ చంపిన మైనర్ కూతురు...

ఈ ఫాంలో ఆమె డెబిట్‌కార్డు వివరాలు, పిన్‌ నెంబరును నమోదుచేసింది. వెంటనే కొద్దిక్షణాల్లో రూ.49,996 నగదు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయినట్లు సవితాశర్మా మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో గాబరాబడిన బాధితురాలు అదే నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌‌ అయినట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయినట్టు తెలుసుకుంది. 

మరుసటిరోజు ఆమె సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్‌‌బుక్‌ ప్రకటన కలిగిన రెస్టారెంట్‌ అడ్రస్‌ సదాశివనగర అని తెలిసింది.  

click me!